బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన సొహైల్ కరోనా సేవల్లోనూ ముందుంటున్నారు. యాంగ్రీ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అతని ఆటతీరుకు లక్షలాది మంది ఆయనకు అభిమానులుగా మారారు.. టాప్ 3 లో ఒకడిగా ఉన్న సొహైల్ మంచి గేమ్ ఆడి తెలివిగా నగదు బహుమతి కూడా గెలుచుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలను పొందిన సోహైల్ హౌస్ నుంచి బయటకు వచ్చాక సేవా కార్యక్రమాల్లోకి దిగారు.
సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న వారికి రేషన్, భోజన సదుపాయాలు సమకూరుస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రజలతో సోహైల్ పంచుకున్నారు. తన ఇన్స్టా లో ఓ వీడియో ద్వారా ఈ సంస్థ పనితీరు వెల్లడించారు. దీన్ని వెనుక ఉండి నడిపించిన వారిని ప్రశంసించారు.
సోహైల్ మాట్లాడుతూ ‘సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేశాం. భవిష్యత్ లో కూడా ఇలానే చేస్తాం.. దానికి మీ ఆశీర్వాదాలు కావాలి. కొన్ని రోజుల్లో వందమంది జూనియర్ ఆర్టిస్ట్ లకు రేషన్, సరుకులు అందించబోతున్నాం. మా చారిటీ సంస్థ ద్వారా నాలుగు ఆపరేషన్స్ ని విజయవంతంగా పూర్తి చేశాం.. వాటిలో ఒకటి న్యూరో సర్జరీ కాగా మరో మూడు హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటి వరకు 24 లక్షలకు పైగా ఖర్చు పెట్టి చారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాం. దీనికి ముందు నుంచి సపోర్ట్ గా ఉన్న సోహిలియన్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అందరికీ అందుబాటు లో ఉంటాను’ అన్నారు.
Must Read ;- ‘బిగ్ బాస్ 5’ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కు తరుణం ఆసన్నమైంది