ఆర్ఆర్ఆర్.. సినీ అభిమానుల ఎవరి నోట విన్నా ఇదే మాట. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా అజయ్ దేవగన్, అలియా భట్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే… ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను సాలిడ్ ప్లానింగ్ లు జరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఈ ఈవెంట్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ముంబాయిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కనీవినీ ఎరుగని రీతిలో చేసేందుకు భారీ ప్లాన్ రెడీ చేశారని.. ఇక్కడ నుంచి ఎన్టీఆర్, చరణ్ అభిమానులను భారీగా తీసుకెళ్లేందుకు స్పెషల్ ట్రైన్ లు కూడా వేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ ను డిసెంబర్ 19న చాలా గ్రాండ్ గా ముంబాయిలో చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ కి గాను చాలా మంది ప్రముఖులే బాలీవుడ్ నుంచి రాబోతున్నట్టుగా టాక్ ఉంది.
ప్రస్తుతానికి అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరవుతాడని టాక్ వినిపిస్తోంది. దీని పై క్లారిటీ రావాల్సివుంది. అలాగే టాలీవుడ్ నుంచి కూడా స్టార్ హీరోలు ఈ ఫంక్షన్ కి హాజరవుతారా అనేది తెలియాల్సివుంది.
Must Read ;- ఆర్ఆర్ఆర్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా..?











