తమిళ స్టార్ హీరో విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహన్ కలయికలో రూపొందిన భారీ చిత్రం మాస్టర్. ఈ చిత్రంలో ఆండ్రియా కీలక పాత్ర పోషిస్తుంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఆండ్రియా, విజయ్ ఉన్న స్టిల్ రిలీజ్ చేశారు. ఆండ్రియా పుట్టినరోజు సందర్భంగా ఈ స్టిల్ రివీలైంది. ఇందు లో విజయ్, ఆండ్రియా పక్కన కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. ఇది ఈ మూవీలో కాలేజ్ ఫంక్షన్ లో వచ్చే సన్నివేశంలో స్టిల్ అని తెలుస్తోంది. మాస్టర్ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ స్టిల్ ఇది అని మేకర్స్ అఫిషియల్ గా రిలీజ్ చేశారు. ఇంకా చెప్పాలంటే.. మాస్టర్ విజయ్ పై ఆండ్రియా మనసు పడిందా.? అన్నట్టుగా ఉంది ఆ స్టిల్.
ఆండ్రియా పుట్టినరోజు కావడంతో చాలా మంది సినీ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ భారీ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా శాంతన్ భాగ్యరాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని 2020లో సమ్మర్ కి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా 2021 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విజమ్ – విజయ్ సేతుపతి ఫస్ట్ టైమ్ కలిసి నటించడం విశేషం.
ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసారు. ఇదిలా ఉంటే.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ నేపధ్యంలో మాస్టర్ టీజర్ రిలీజ్ కావడంతో.. రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో మాస్టర్ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. మరి.. సంక్రాంతికి రానున్న ఈ సినిమా ఏ స్ధాయి విజయం సాధిస్తుందో చూడాలి.
Muat Read ;- రజనీ చివరి చిత్రం ఎన్నికల లోపు వస్తుందా? రాదా?