రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠ నెలకొంది. దుబ్బాక ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. రౌండ్ రౌండ్‌కు లెక్కలు మారుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 10 రౌండ్లకు కౌంటింగ్ పూర్తయింది. తాజాగా 10వ రౌండ్‌లో 456 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొదటి 5 రౌండ్లలో వరుసగా బీజేపీ తన ఆధిక్యతను కనబరచగా 6వ, 7వ, 10వ రౌండ్లలో మాత్రం కమలాన్ని వెనక్కు నెట్టేసీ కారు తన స్పీడ్‌ను పెంచింది. మళ్లీ 8వ రౌండ్‌లో బీజేపీ దూసుకుపోయింది. అలాగే 9వ రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావే ఆధిక్యాన్ని కనబరిచారు. తరువాత జరిగిన 10వ రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ లీడింగ్‌లో ఉంది. మొత్తం 10 రౌండ్లకు కౌంటింగ్ పూర్తి అయింది. 10 రౌండ్లకు కౌంటింగ్ జరగగా అందులో 7 రౌండ్లలో బీజేపీ, మూడు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి మూడవ స్థానానికే పరిమితమైంది.
రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠ…
ఇప్పటివరకు జరిగిన మొత్తం తొమ్మిది రౌండ్ల లెక్కింపులో 9వ రౌండ్ లోనే బీజేపీకి అత్యధికంగా ఆధిక్యత లభించినట్లు తెలుస్తోంది. ఈ ఒక్కరౌండ్ లోనే 1084 ఓట్లను టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లను గెల్చుకుంది. 10 రౌండ్‌లో 456 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంను ప్రదర్శించింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్-2948, బీజేపీ-2492, కాంగ్రెస్-899 ఓట్లను సాధించారు. 10వ రౌండ్‌లో మొత్తం లెక్కించిన ఓట్లు 7233. ఇప్పటి వరకు మొత్తం లెక్కించిన ఓట్లు74040. మొత్తం 10 రౌండ్లు ముగిసేసరికి ఇంకా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ కంటే 3734 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు బీజేపీకి పోలైన ఓట్లు 31783, టీఆర్ఎస్‌కు పోలైనవి 28049, అలాగే కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓనట్లు 6699. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 90 వేల 152 ఓట్లు ఉన్నాయి.