జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో కుమ్మలాటలు జరుగుతున్నాయి. నేతల మధ్య అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఏకంగా ఆ పార్టీ కీలక నేత, గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బీజేపీ రాష్ట్ర పార్టీలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. బీజేపీ పార్టీ సీనియర్ నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా అనుచరులకు అన్నాయం చేశాడు. నా హిందూయిజాన్ని కాపీ చేసి ఇప్పుడు పెద్ద నాయకుడిలా ఫోజులు ఇస్తున్నాడు. త్వరలో బండి సంజయ్‌కి బీజేపీ కార్యకర్తలే బుద్ధి చెప్తారు.’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టిక్కెట్ విసయంలో రగడ..
గన్‌ఫౌండ్రీ బేగంబజార్ కార్పొరేటర్ టిక్కెట్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నది. ఈనేపథ్యంలోనే బండి సంజయ్‌పై రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గన్‌ఫౌండ్రీ బేగంబజార్ టిక్కెట్లు తన అనుచరులకు ఇవ్వాలని పార్టీని రాజాసింగ్ కోరారు. అయితే ఆ టిక్కెట్ తన అనుచరులకు ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇచ్చారని ఆగ్రహంతో సంజయ్ పై రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ’బండి సంజయ్ నన్ను మోసం చేసిన మాట వాస్తవమే అన్నారు. నా నియోజకవర్గంలో నేను చెప్పిన వారికే గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని అడిగాను. మిగతా డివిజన్‌లలో ఎక్కడా కూడా నేను అడగను అని చెప్పాను. కానీ టిక్కెట్ల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు‘ అని ఆరోపించారు. ప్రస్తుతం తన కుటుంబంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ చావులో తాను ఉన్నానని 3, 4 రోజుల్లో ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలపై కేంద్ర పార్టీకి లేఖ రాస్తాని రాజాసింగ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీ-ఫామ్ కోసం రాజాసింగ్ వర్గానికి మరో వర్గానికి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించాలని తాను ట్విట్టర్‌లో తెలపడమనేది అవాస్తవమని రాజాసింగ్ అన్నారు.
Must Read ;- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇలాఖాపై టీఆర్ఎస్ ఫోకస్!