GHMC ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 56 సీట్లు గెలిచినా ఎక్స్ అఫిషియో మెంబర్ల ఆధారంగా వారే టీఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలుపులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇక్కడ టీఆర్ ఎస్ గెలవడం అనేకంటే ఎన్ని సీట్లు వచ్చాయనే అంశం ప్రధానంగా కనిపిస్తోంది.
టీఆర్ఎస్కు తాత్కాలిక ఉపశమనమే..
2016 ఎన్నికల్లో 99 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది . ఆ ఎన్నికల్లో కేటీఆర్ అంతా తానై వ్యవహరించారు. జీహెచ్ఎంసీ గెలుపు కూడా కేటీఆర్ క్రెడిట్గానే అప్పట్లో చర్చ నడిచింది. ఈ సారి 99కంటే ఎక్కువే గెలుస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. అయితే తాజాగా 56 సీట్లే వచ్చాయి. గెలుపు గెలుపే అయినా.. టీఆర్ఎస్కు మాత్రం రెండో అలర్ట్ బెల్ అని చెప్పవచ్చు. దుబ్బాకలో ఓడిన టీఆర్ఎస్కు ఈ గెలుపు తాత్కాలిక ఉపశమనంగానే భావించాల్సి ఉంటుంది. ఓవైపు బీజేపీ దూకుడు, మరోవైపు మారుతున్న ఓటరు అభిప్రాయాల విషయంలో టీఆర్ఎస్ రానున్న కాలంలో చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కొన్ని గణాంకాలు చూస్తే..
పెరిగిన బీజేపీ షేర్..
2014 ఎన్నికలు కేవలం సెంటిమెంట్ అనే విశ్లేషణలున్నాయి. తరువాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలను పరిశీలిస్తే.. 2016లో…150 డివిజన్లలో మొత్తం 33, 49,379ఓట్లు పోలయ్యాయి. ఓట్లు, శాతంలో చూస్తే.. 2016లో టీఆర్ఎస్ కు 14, 68,618ఓట్లు రాగా 43.85 శాతంగా నమోదైంది. బీజేపీకి 3,46,253 ఓట్లు, 10.34శాతం, కాంగ్రెస్‌కు 3,48,388 ఓట్లు, 10.40 శాతం, ఎంఐఎంకు 5,30,812 ఓట్లు రాగా 15.85 శాతం, బీఎస్పీకి 10,478 ఓట్లు, సీపీఐకు 12,748 ఓట్లు, సీపీఐ(ఎం) కు 1921, లోక్ సత్తాకు 115 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 2016లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 సీట్లు గెలుచుకున్నాయి. టీఆర్ఎస్ ఏకచత్రాధిపత్యంతో మేయర్ పీఠం దక్కించుకుందని చెప్పవచ్చు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే.. టీఆర్ఎస్కి 46.9శాతం ఓట్లు రాగా 88 గెలిచింది. కాంగ్రెస్‌కి 28.4 శాతం ఓట్లు, టీడీపీకి 3.5శాతం, బీజేపీకి 7.1శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే.. టీఆర్ఎస్కి 41శాతం, కాంగ్రెస్‌కి 29శాతం, బీజేపీకి 20శాతం ఓట్లు వచ్చాయి.
Also Read ;- చరిత్ర మరవని రోజు.. కేసీఆర్ ఆమరణ దీక్షకు 11 ఏళ్లు!
TRS ఓటింగ్ షేర్..
2016 GHMC ఎన్నికలు- 43.85
2018 అసెంబ్లీ ఎన్నికలు-46.9
2019 లోక్ సభ ఎన్నికలు 41శాతం
బీజేపీ
2016 GHMC ఎన్నికలు- 10.34
2018 అసెంబ్లీ ఎన్నికలు – 7.1
2019 లోక్ సభ ఎన్నికలు- 20
ఈ గణాంకాలు చూస్తే.. టీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల శాతంలో కొంత హెచ్చు తగ్గులున్నా.. బీజేపీ షేర్ పెరిగింది. ప్రస్తుత GHMC ఎన్నికల్లో కూడా రెండో స్థానం కైవసం చేసుకుంది. ఇప్పటికే దుబ్బాకలో గెలిచి ఉండడం, జీహెచ్ఎంసీలో అధికార టీఆర్ఎస్ కు ధీటుగా రావడంతో రానున్న కాలంలో బీజేపీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అసలు బీజేపీ లేదన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దానినే ప్రధాన పోటీదారుగా తప్పనిసరిగా భావించాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు.
బీజేపీ దూకుడుతో టెన్షనే..
ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే.. గెలుపు ఆ పార్టీలో ఉత్సాహం నింపుతున్నా.. బీజేపీ దూకుడు కొంత టెన్షన్‌ని కూడా కలిగిస్తుంది. తమకు ఎదురులేదు…కేసీఆర్, కేటీఆర్ లకు సమీపంలో ఎవరూ లేరు అనుకునే సగటు టీఆర్ఎస్ అభిమానికి బీజేపీ దూకుడు మింగుడుపడదని చెప్పవచ్చు. గతంలో తాము ఏది చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు..తామే తెలంగాణ..తెలంగాణనే తాము అని చెప్పిన టీఆర్ఎస్ నేతలు ఇక తమ వ్యూహాల్లో మార్పులు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
ఇక మరో అంశం ఏంటంటే.. రాష్ట్రంలో పరిస్థితి వేరు..GHMC లో పరిస్థితి వేరు అని చెప్పవచ్చు. మొన్న వరదలు కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కొంత నష్టం కలిగించాయి. ఇక ట్రాఫిక్ సమస్య, రోడ్ల్లు, మౌలిక సదుపాయాలపై మరింత చొరవ చూపితేనే రానున్న కాలంలో టీఆర్ఎస్ తమ ఆధిపత్యాన్ని కాపాడుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక కేటీఆర్ విషయానికి వస్తే.. ఆ పార్టీలో అనధికారికంగా కొంత కాలంగా కేటీఆర్ సీఎం అవుతారని చర్చ నడుస్తోంది. ఆ చర్చకు ఆధారాలు, లెక్కలు లేవని గతంలో కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారు. అయితే తరువాత కూడా చర్చ నడుస్తోంది. GHMC లో 99కి మించి సీట్లు వస్తే..కేటీఆర్ ఇమేజ్ తారాస్థాయికి వెళ్లేది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పైగా GHMCలో గెలిచినా..గతంలో కంటే దాదాపు సగం సీట్లు తగ్గడం.. ఆ పార్టీకి మరో మరకగా భావించవచ్చు. అది టీఆర్ఎస్కి, కేటీఆర్‌కి మంచిది కాదని, రాజకీయంగా కొంత ఇబ్బందే అనే చర్చ మొదలైంది.
Must Read ;- కేసీఆర్ బక్క జీవి కామెంట్స్‌పై విజయశాంతి సెటైర్!