ఔను వాళ్లిద్దరూ ఇష్టపడుతున్నారు…వారిద్దరి బంధం బలపడుతోంది. దాగుడు మూతల స్టేజ్ దాటి..ఒకరికొకరు చేయందించుకునేదాకా వచ్చారు..ఇక బహిరంగంగా కావలించుకునే రోజు కూడా ఎంతో దూరం లేదనిపిస్తోంది. తప్పయినా..ఒప్పయినా..జగన్మోహన్రెడ్డి ఏం చేసినా అడ్డుపడకుండా బిజెపి మౌనం వహించినప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. అప్పటికే చంద్రబాబును ఓడించటానికి ఇద్దరూ కలిసి పని చేశారన్నది బహిరంగ రహస్యం. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబునాయుడు అపద్ధర్మ సీఎంగా ఉన్నా.. పవర్స్ మాత్రం జగన్ దగ్గరే ఉన్నాయనిపించింది.. ఎన్నికల కమిషన్ అంత వన్ సైడుగా వ్యవహారం నడిపించిందనే ఆరోపణలు వచ్చాయి.
కొత్త మిత్రులను కూడా పోగేసుకోవాలనే పరిస్ధితికి..
ఆ తర్వాత రాజకీయ లక్ష్యం నెరవేరింది కాబట్టి..ఇక జగన్ సంగతి చూస్తారని అందరూ అనుకున్నారు. కమలనాథుల వ్యూహాలన్నీ అలాగే ఉంటాయి మరి. కాని ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. ఎందుకంటే బిజెపి దేశవ్యాప్తంగా బలహీనపడుతోంది. ఒకప్పుడు రాజ్యసభలో కూడా బిజెపి సొంత బలం పెరగటానికి ఇంకెన్నో రోజులు లేవంటూ లెక్కలేసుకునేవారు. అవన్నీపోయాయి.. ఇప్పుడు ఎన్నిలెక్కలేసుకున్నా.. రాజ్యసభలో బలం పెరగదని అర్ధమైపోయింది. అందుకు కారణం.. రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓడిపోవటం.. అది కూడా కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభంలో ఉన్నాకూడా..ఆయా రాష్ట్రాల్లో దానికి విజయాలు దక్కాయి. బెంగాల్లో గెలిచి తొడగొడదామనుకున్నారు..కాని అక్కడ దీదీ దెబ్బకు నీరసపడిపోయారు. రేపు త్వరలో ఎన్నికలు జరగబోయే యూపీ లాంటి రాష్ట్రాలలో కూడా పరిస్ధితి అనుకూలంగా లేదు. దీంతో మిత్రులు అవసరం లేదనుకునే పరిస్దితి నుంచి కొత్త మిత్రులను కూడా పోగేసుకోవాలనే పరిస్ధితికి బిజెపి రోజురోజుకు నెట్టివేయబడుతోంది.
జగన్ సహకారాన్ని కూడా.
అందుకే బిజెపి జగన్ అంతు చూడటం కాదు.. జగన్ సహకారాన్ని సైతం పొందాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జగన్, కేసీఆర్ ఇద్దరితోనూ సంప్రదింపులు జరిపారు. రైతుల బిల్లుపై జగన్, కేసీఆర్ సభలో మద్దతు తెలిపి..బయట మాత్రం బిల్డప్ ఇచ్చారు.. ఇంకా ఇస్తూనే ఉన్నారు. రేపు అలాంటి సందర్భాలు మరిన్ని వస్తాయి. కోవిడ్ నేపధ్యంలో మోదీ ఇమేజ్ మసక బారింది. దాన్నుంచి బయటపడానికి మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రికి జగన్ హిత బోధ చేయటం.. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా పొగడటం ఈ మధ్య పెరిగిపోయింది. అందుకేనేమో బిజెపి సైతం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ విధానం చేపట్టినా అభ్యంతరం పెట్టడం లేదు. రాష్ట్రంలో బిజెపి నేతలు గాని, జనసేన నేతలు గాని స్టేట్మెంట్లే తప్ప ఆచరణ ఉండటం లేదు.. దీనికి కారణం పై నుంచి వారికి వస్తున్న ఆదేశాలే. ఇప్పుడు రాజధాని విశాఖకు మార్చడానికి సైతం బిజెపి ఓకె చెప్పేసినట్లే ఉంది.
బిజెపికి తెలియకుండా జరిగిందా..
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలోనూ బిజెపికి తెలియకుండా జరిగిందని అనుకోవడానికి వీల్లేదు. ఎంపీకి ఉన్న స్పెషల్ సెక్యూరిటీ..ఓ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రివిలైజేస్ అన్నీ దాటుకుని అంత చేయగలిగారంటే కేంద్రంలోని వారి సహకారం లేకుండా జరగదు. కేవలం సుప్రీంకోర్టు వల్లే రఘురామ బయటపడ్డారు ప్రస్తుతానికి. రేపు స్పీకర్ రఘురామ సస్పెన్షన్ను ఓకె చేస్తే చాలు.. అందరికీ అర్ధమైపోతుంది వైసీపీ, బిజెపి బంధం ఎంత గట్టిపడిందో తెలుసుకోవడానికి.
Must Read ;- పంతం నెగ్గించుకోనున్న జగన్.. విశాఖలో క్యాంప్ ఆఫీస్