టాలీవుడ్ లో విలక్షణ పాత్రలతో.. సరికొత్త మేకోవర్ తో కనిపించాలని తపించే స్టార్ హీరోల్లో బన్నీ ఒకరు. తాను నటించే ప్రతి సినిమాలోని పాత్ర స్వభావాన్ని బట్టి.. తన హెయిర్ స్టైల్ .. బాడీ కాంప్లెక్షన్ మార్చుకోవడం అతడికి కెరీర్ బిగినింగ్ నుంచీ అలవాటు. ఎర్లియర్ గా అల వైకుంఠపురములో సినిమాతో అందరికీ వినోదాన్ని పంచి.. బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న బన్నీ.. ఇప్పుడు సుకుమార్ ‘పుష్ప’ చిత్రంలో ఓ డిఫరెంట్ పాత్రతో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు.
సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ‘పుష్ప’ మూవీలో బన్నీ.. లారీ డ్రైవర్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు బన్నీ శరీరం కారు నలుపుతో ఉంటుందట. అలాగే.. తైల సంస్కారం లేని.. ఉంగారాల జుట్టు.. మాసిపోయిన బట్టలు.. టోటల్ గా అతడి కేరక్టర్ చాలా రఫ్ అండ్ టఫ్ గా చూడగానే కాస్తంత భయంకరంగా కనిపిస్తుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రోజున విడుదల చేసిన పోస్టర్ లో ఈ విషయం చాలా స్ఫష్టంగా తెలుస్తుంది.
ఇక ఈ పాత్రకు సంబంధించిన బాడీ కాంప్లెక్షన్ కోసం బన్నీకి మేకప్ వేసుకోవడానికి రోజుకు రెండు గంటల సమయం పడుతోందట. అలాగే.. ఆ మేకప్ తీయడానికి సరిగ్గా గంటన్నర పడుతోందట. ప్రస్తుతం తమిళనాడులోని తెన్ కాశీలో ప్రస్తుతం పుష్ప షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియాలో కేటగిరిలో ఆగస్ట్ 13న పుష్ప సినిమా విడుదల కాబోతోంది. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి బన్నీ మేకోవర్ పుష్ప సినిమా కి ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.
Must Read ;- బన్నీతో కొరటాల సినిమా .. పనులు మొదలయ్యాయట!