మార్వెల్ బ్లాక్ పాంథర్ సినిమాలలో మాత్రమే కాకుండా, తను చేసిన ప్రతి పాత్రకూ జీవం పోసిన చాడ్విక్ బోస్మాన్ మొన్న లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు చనిపోయారు. బ్లాక్ పాంథర్ లో ప్రధాన పాత్రగా నటించడం కాకుండా, చాడ్విక్ చాలా సినిమాలలో నటించాడు.
తను కింగ్ ట’చల్లా పాత్రలో జీవాన్ని పోసి, మార్వెల్ అభిమానుల హృదయాలలో చోటు సంపాదించాడు. కానీ, తను ఆగస్టు 28వ తేదీన కోలన్ కాన్సర్ వల్ల చనిపోయాడు. కానీ, తను చాలా చాలా మంచి సినిమాలు చేశాడు. అతని సినిమాలలో కొన్ని అద్భుతమైన సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
42
42 సినిమాతోనే బోస్మాన్ హాలీవుడ్ లో తన తెరంగేట్రం చేశాడు. 2013 లో వచ్చిన ఈ సినిమా, జాకీ రాబిన్సన్, మేజర్ లీగ్ బేస్-బాల్ (ఎం.ఎల్.బీ) లో ఆడిన మొదటి నల్లవాడి గురించి ఒక బయోపిక్. ఈ సినిమాలో చాడ్విక్ జాకీ పాత్ర పోషించాడు. కథలో వెండెల్ స్మిత్ అనే స్పోర్ట్స్-రైటర్ బ్రూక్లిన్ డాడ్జర్స్ అనే బేస్-బాల్ టీమ్ ఓనర్, బ్రాంచ్ రిక్కీ కి జాకీ రాబిన్సన్ ని తను వెతుకుతున్న బ్లాక్ బాల్ ప్లేయర్ గా తీసుకోమని సలహా ఇస్తాడు. రాబిన్సన్ తన టీమ్ తో పాటు ఒక పెట్రోల్ బంక్ కి వెళ్లున్నప్పుడు, అక్కడి అటెండెంట్ రాబిన్సన్ ని వివక్షతో చూస్తాడు. రాబిన్సన్ తనతో మాట్లాడుతూ ఉండగా, డాడ్జర్స్ టీమ్ నుంచి రిక్కీ పంపిన ఒక స్కౌట్ వచ్చి రాబిన్సన్ ని వాళ్లకు ఆడమని అడుగుతాడు. రాబిన్సన్ కి తన జీతం గురించి చెప్పాక, కోపాన్ని తగ్గించుకోమని రిక్కీ తనకి చెప్తాడు. కొద్ది రోజులు అయ్యాక, చాలా మంది ఆటగాళ్లు వాళ్లు రాబిన్సన్ తో ఆడదల్చుకోలేదని ఒక పిటిషన్ చేస్తారు. మిగిలిన సినిమా అంతా జాకీ ఒక బ్లాక్ అమెరికన్ అయ్యుండి తనకి లోకం నుంచి వచ్చే వివక్షలని ఎదుర్కొని. ఎలా ఉత్తమ బేస్-బాల్ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు అనే దాని మీద దృష్టి పెడుతుంది. ఈ సినిమాలో చాడ్విక్ జాకీ పాత్ర పోషించిన తరువాత, చాలా ప్రసిద్ధమైన కార్యక్రమాలకు వెళ్లాడు.
గెట్ ఆన్ అప్
2014లో చాడ్విక్ గెట్ ఆన్ అప్ అనే మరో బయోపిక్ లో నటించాడు. ఈ సినిమా, ఒక బ్లాక్ అమెరికన్ సింగర్ అయిన జేమ్స్ బ్రౌన్ జీవిత చరిత్ర. ఈ సినిమా 1933లో పుట్టిన జేమ్స్ బ్రౌన్ అనే సింగర్ గురించి. అతను ఒక చాలా పేద కుటుంబంలో పుట్టి, చాలా రకమైన కష్టాలను తట్టుకుని 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన మ్యూజిషియన్ అయ్యాడు. ఈ సినిమా అంతా దీని మీదే సాగుతుంది. ఈ సినిమా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, వంటి చాలా అవార్డ్స్ కు నామినేషన్స్ సంపాదించింది.
మార్షల్
2017 లో చాడ్విక్ స్టేజ్ 3 కోలన్ కాన్సర్ తో నిర్ధారించబడిన తరువాత తను మార్షల్ సినిమాలో ఒక ఎన్.ఏ.ఏ.సీ.పీ లాయర్, థర్గుడ్ మార్షల్ గా నటించాడు. థర్గుడ్ మార్షల్ మొదటి ఆఫ్రికన్-అమెరికన్ కోర్ట్ జస్టిస్ అయ్యాడు. ఈ సినిమాలో మార్షల్ ఒక క్రిమినల్ కేస్ డీల్ చేయాల్సి వస్తుంది. కానీ, వీళ్లకు ఉండే అన్నిటికన్నా ముఖ్యమైన ఆటంకం ఏంటంటే, వాళ్లు కేవలం కేస్ ను డీల్ చేయడం మాత్రమే కాకుండా, రేసిస్ట్ ఇంక ఆంటీ-సెమిటిక్ వ్యూస్ ఉన్న లోకాన్ని ఎదుర్కోవాలి. ఈ సినిమా ‘బెస్ట్ అఛీవ్మెంట్ ఇన్ మ్యూజిక్ రిటెన్ ఫర్ మోషన్ పిక్చర్స్’ కు ఆస్కార్ నామినేషన్ పొందింది.
డా 5 బ్లడ్స్
ఇది చాడ్విక్ నటించిన అతి కొత్త సినిమా. ఇది ఈ సంవత్సరం జూన్ 12న రిలీస్ అయింది. ఈ సినిమా, నలుగురు వెట్స్ తమ చనిపోయిన స్క్వాడ్ నాయకుడి అవశేషాలు ఇంక అతను దాచడానికి సహాయం చేసిన బంగారం కోసం వియత్నాంకు తిరిగి వస్తారు. సినిమా అంతా వీటి కోసం వాళ్ల పోరాటంతో నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది.
డ్రాఫ్ట్ డే
ఈ సినిమా ఫుట్-బాల్ లో జరిగే రాజకీయాల మీద దృష్టి పెడుతుంది. సన్నీ వీవర్ క్లీవ్లాండ్ బ్రౌన్స్ అనే ఫుట్-బాల్ టీమ్ కి మేనేజర్. నేషనల్ ఫుట్-బాల్ లీగ్ డ్రాఫ్ట్ డే దగ్గర పడుతూ ఉంటుంది. కానీ సన్నీకి ఏయే ఆటగాళ్లను నియమించుకోవాలి అనేది మాత్రమే కాకుండా వేరే చాలా విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఆ టీమ్ ఓనర్ తనని ఫైర్ చేద్దామని అనుకుంటున్నాడు. ఈలోగా, సియాటిల్స్ నుంచి తనకి ఒక డీల్ వస్తుంది. డీల్ ప్రకారం అతనికి ఆ టీమ్ ఫస్ట్ రౌండ్ పిక్ వస్తుంది. కానీ, త్వరలోనే సన్నీ తన నిర్ణయాన్ని ప్రశ్నించుకుంటాడు…
చాడ్విక్ బోస్మాన్ గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే, అతనికి కోలన్ క్యాన్సర్ ఉండి కూడా, దానితో పోరాడుతూ తను 6 సినిమాలలో నటించాడు.