బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ .. సోషల్ మీడియాను వదిలేస్తున్నానని చెప్పి.. అభిమానులకు పెద్ద షాకిచ్చాడు. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న ఆమిర్ .. అందరికీ ధన్యవాదాలు తెలిపి.. ఈ నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే.. తన అభిమానులకు థాంక్స్ చెబుతూ.. చివరగా సందేశాన్నివ్వడం వైరల్ గా మారింది.
నా అభిమానులకు కృతజ్ఞతలు. ఇప్పటివరకూ మీరు నన్ను ఎంతగానో ఆదరించారు. మీరు పంచిన ప్రేమకు, మీరిచ్చిన సపోర్ట్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా హృదయం ప్రేమతో నిండిపోయింది. ఇదే నా చివరి సోషల్ మీడియా పోస్ట్. అయినప్పటికీ మీతో నేను ఎప్పటికీ కాంటాక్ట్ లోనే ఉంటాను. నాకు సంబంధించిన అప్టేట్స్ ను ఆ అఫీషియల్ చానల్ నుంచి పొందవచ్చు. అంటూ.. ఆమిర్ సందేశంలో పేర్కొన్నాడు. ఆయన పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడని బాలీవుడ్ జనం అంటున్నారు.
Must Read ;- బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్










