బాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హీరో ఒకే ఒక్క అక్షయ్ కుమార్. అలాగే విలక్షణమైన పాత్రలకూ అతడు పెట్టింది పేరు. ఎర్లియర్ గా మంచి మంచి హిట్స్ అందుకున్న ఈ హీరో.. లేటెస్ట్ గా సౌత్ బ్లాక్ బస్టర్ ‘కాంచన’ రీమేక్ వెర్షన్ ‘లక్ష్మి’తో ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. ఓటీటీలో విడుదలైనప్పటికీ.. అందరూ ముక్తకంఠంతో ఫ్లాప్ అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయినప్పటికీ తనకి కథ నచ్చాలేకానీ .. అది సౌత్ సినిమానా? హిట్ సినిమానా అని చూడడు అక్కీ. ఈ నేపథ్యంలో అతడి దృష్టిలో పడిన ఓ ఫ్లాప్ తెలుగు మూవీ ‘ఊసరవెల్లి’.
యన్టీఆర్, తమన్నా జంటగా.. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించాడు. లైన్ బాగున్నప్పటికీ ఎక్జిక్యూషన్ లో ఎక్కడో పొరపాటు జరిగి.. ఫ్లాప్ గా ముద్ర వేయించుకుంది సినిమా. ఇదే సినిమా ఇంతకు ముందు బెంగాలీలో రీమేక్ అయింది. అక్కడ కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. అయినా సరే ఈ సినిమాను అక్షయ్ కుమార్ హిందీలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు వార్తలొస్తున్నాయి.
టిప్స్ సంస్థ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ‘ఊసరవెల్లి’ కథలో చాలా మార్పులు చేయబోతున్నారట. తెలుగులో ఫ్లాప్ అవడానికి కారణమైన అంశాలన్నిటినీ పరిశీలించి.. వాటిని హిందీ వెర్షన్ కోసం బెటర్ గా మార్చబోతున్నారట. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇక ఇందులో టెక్నీషియన్స్ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అతి త్వరలో ‘ఊసరవెల్లి’ హిందీ వెర్షన్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి బాలీవుడ్ లో ‘ఊసరవెల్లి’గా అక్కీ ఎలా మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Must Read ;- 13 ఏళ్ల తర్వాత బొమ్మరిల్లు హిందీ రీమేక్ కు మోక్షం