రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ సినిమాతో బాలీవుడ్ లో నటుడిగా అడుగుపెట్టాడు మరాఠీ నటుడు మనోజ్ బాజ్ పాయ్. ఆ తర్వాత మరికొన్ని మంచి సినిమాలతో బాలీవుడ్ లో నటుడిగా నిలదొక్కుకున్నాడు. హ్యాపీ, కొమరం పులి సినిమాలతో తెలుగులోనూ ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ తోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. త్వరలో ఫ్యామిలీ మ్యాన్ 2 తోనూ మెప్పించబోతున్నాడు.
ప్రస్తుతం మనోజ్ .. ఓ భారీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇంతలోనే ఆయనకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందట. కొత్త సినిమా డిస్పాచ్ షూటింగ్ లో పాల్గొనే టైమ్ లోనే ఆయనకి కరోనా సోకిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నాడని సమాచారం. మనోజ్ బాజ్పాయి బృందం దీనికి అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ ఆపేశారట. కొద్ది రోజుల్లో తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారట.
Also Read : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్