బాలీవుడ్ మున్నాభాయ్ .. సంజయ్ దత్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నో అత్యుత్తమ పాత్రలతో మంచి పెర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సంజయ్ దత్ పలు వివాదాల్లో చిక్కుకొని జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు. తాజా గా సంజయ్ దత్ తనకి కేన్సర్ అని చెప్పి.. భారతీయ ప్రేక్షకులకు గట్టి షాక్ నిచ్చాడు. ఆగష్ట్ లో సంజూ కేన్సర్ కారణంగా విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగా అతడు నటిస్తోన్న పలు చిత్రాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఎంతో మంది అభిమానులు సంజయ్ కేన్సర్ నుంచి తిరిగి కోలుకోవాలని కోరుకున్నారు. వారి ప్రార్ధనల ఫలితమో ఏమో కానీ, తాను ఇప్పుడు కేన్సర్ నుంచి కోలుకున్నట్టు సంజయ్ తెలపడం అందరికీ సంతోషం కలిగిస్తోంది.
రీసెంట్ గా సంజయ్ దత్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సంజయ్ తన పిల్లలలో ఒకరి పుట్టినరోజు కావడంతో తను క్యాన్సర్ నుండి కోలుకున్నట్టు వెల్లడించారు. `గత కొన్ని వారాలు నాకు, నా కుటుంబానికి చాలా కష్టమైన సమయం. కొంత మంది చెప్పినట్లుగా దేవుడు బలమైన సైనికులకే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని కల్పిస్తాడు. ఈ రోజు నా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈ యుద్ధం నుండి విజయం సాధించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. క్యాన్సర్ ను జయించి వారికి నేను మంచి బహుమతిని ఇవ్వగలిగాను` అని అన్నాడు సంజయ్.
My heart is filled with gratitude as I share this news with all of you today. Thank you 🙏🏻 pic.twitter.com/81sGvWWpoe
— Sanjay Dutt (@duttsanjay) October 21, 2020










