అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ, అందాల శ్రీదేవి జంటగా ఎన్నో సూపర్ హిట్ సినిమా లొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ఇద్దరి లెగసీ కంటిన్యూ చేయాలంటే.. మహేశ్ బాబు , జాన్వీకపూర్ రంగంలోకి దిగాల్సిందే. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని సమాచారం. మహేశ్, జాన్వీ జంటగా.. ఓ క్రేజీ సినిమా తెరకెక్కించడానికి ఆయన ఓ యంగ్ డైరెక్టర్ ను రంగంలోకి దింపుతున్నాడని టాక్. ఈ సినిమాను కేవలం 60 రోజుల్లోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తున్న మహేశ్ బాబు .. ఆ సినిమా కంప్లీట్ కాగానే.. తన ప్రాజెక్ట్ టేకప్ చేసేలా కరణ్ ప్లాన్ చేస్తున్నాట . రాజమౌళితో చేయబోయే సినిమా కోసం మహేశ్ ఎక్కువ కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుంది. పైగా ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. అందుకే ఈ గ్యాప్ లోనే అతడితో 60 రోజుల్లో సినిమాను కంప్లీట్ చేయాలని కరణ్ జోహార్ అనుకుంటున్నాడట . ఈ మూవీతో జాన్వీ తెలుగు ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయం కాబోతోందట. పాన్ ఇండియా లెవెల్లో హిందీ తో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ సినిమా విడుదలవుతుందట. మరి కరణ్ జోహార్ .. ప్రపోజల్ కి మహేశ్ బాబు ఏమంటాడో చూడాలి.