తాప్సి పన్ను ఈ రోజు దేశవ్యాప్తంగా అందరికి తెలిసిన హీరోయిన్. పింక్ , బద్లా , తప్ప డ్ సినిమాలతో తన మార్కెట్ పెంచుకుంది . మంచి నటిగా పేరు తెచ్చుకుంది . కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . సక్సెస్ రాగానే , మూలాలు మర్చిపోయి , మాట్లాడే స్టార్స్ కోవలోకి తాప్సి కూడా చేరి పోయింది . తాప్సి మొదటి అవకాశం ఇచ్చింది తెలుగు సినిమా ! ” ఝుమ్మంది నాదం ” సినిమాలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా తాప్సి కి అవకాశం ఇచ్చారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. ఆ తర్వాత ‘ మిస్టర్ పర్ఫెక్ట్ ‘ , ‘ వస్తాడు నా రాజు ‘ , ‘ షాడో ‘ మొదలు అయిన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది . బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
అక్కడ ఒక్క సక్సెస్ రాగానే , మీడియా ముఖంగా తెలుగు సినిమా రంగాన్ని , తన మొదటి దర్శకుడు రాఘవేంద్రరావు ని దుమ్మెత్తి పోసింది తాప్సి. తెలుగు దర్శకులకి హీరోయిన్ బొడ్డు చూపించడం తప్పితే – మరొకటి చేత కాదని అవహేళన చేసింది తాప్సి. ఆ మాటకి తెలుగు సినిమా రంగం నొచ్చుకుంది . అప్పటి తాప్సి సినిమా ” ఆనందో బ్రహ్మ ” ని బోయకొట్ చేయాలనీ కొందరు పిలుపు ఇచ్చినా , లాభం లేకపోయింది . ఆనందో బ్రహ్మ మంచి హిట్. ఆ తర్వాత వచ్చిన ‘ నీవెవరో ‘ సినిమా ప్లాప్ అయింది . ప్రసుతం హిందీ లో బిజీ గా ఉన్న తాప్సి తన మాతృ భాషలో నటించడం చాలా సుఖం గా ఉందని ఇంటర్వ్యూ లో చెప్పింది . ఆ మాట నిజం అయినప్పుడు – ముంబై వదిలేసి , తెలుగు సినిమా రంగానికి రావడం ఎందుకు ? ఇక్కడ పేరు , డబ్బు సంపాందించుకుని – తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం ఎందుకు ? అని టాలీవుడ్ లో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల ” భాగమతి ” డైరెక్టర్ అశోక్ కథ చెబితే – తాప్సి తెలుగు లో చేయనని రిజెక్ట్ చేసిందట . ఒక అగ్ర నిర్మాణ సంస్థ స్క్రిప్ట్ పంపిస్తే చూడటానికి కూడా ఆసక్తి చూపలేదట తాప్సి. మరో వైపు – ఈ మధ్యనే విజయ్ సేతుపతి తో కలిసి , ఒక తమిళ సినిమాలో నటించింది తాప్సి. మరి తమిళం తాప్సి మాతృ భాషా ? తాప్సి అనే కాదు – పూజ హెగ్డే కూడా ఇలాగె తెలుగు సినిమాని అవహేళన చేస్తూ , మాట్లాండింది. తెలుగు డైరెక్టర్స్ కాళ్ళు, తొడలు చూపించడానికి తాపత్రయ పడతారని బాలీవుడ్ మీడియా ముందు కామెంట్స్ చేసింది. మరి ఈ బాలీవుడ్ హీరోయిన్లకు తెలుగు సినిమా షూటింగ్స్ లో ఆక్ట్ చేసేటప్పుడు , గ్లామర్ ఒలకబోసేటప్పుడు తెలియదా ? చేయనని మానేసి వెళ్లిపోవచ్చు కదా ?! అందాల ప్రదర్శనకు అభ్యంతరాలు ఉన్నప్పుడు- ఇంస్టాగ్రామ్ లో వాళ్ళు పెట్టె ఫోటోలు ఆ హీరోయిన్లు చూసుకోరా ?! మరి ఈ రెండు నాల్కల ధోరణి ఎందుకు ? అని అంటున్నారు టాలీవుడ్ జనం.
ఏరు దాటేంటేంతవరకు – పడవ మల్లన్న .. ఒడ్డు దిగాక – బోడి మల్లన్న !! ఇలా ఒక్క బాలీవుడ్ హీరోయిన్- కన్నడ సినిమా రంగం గురించి కామెంట్ చేయమనండి !! జీవితంలో మళ్ళి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. కానీ తెలుగు సినిమా రంగం అవకాశాలిచ్చి.. అవమానాలు పడుతోంది. అదే బాలీవుడ్ భామల మిడిసిపాటుకు కారణమైంది.
Also Read: అనురాగ్ కశ్యప్ కు షాక్ ఇచ్చిన ముంబై పోలీసులు