‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమాల రూపురేఖలే మారిపోయాయి. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకూ బాలీవుడ్ మార్కెట్ హస్తగతం చేసుకోడానికి పాన్ ఇండియా బాట పడుతున్నారు. ప్రస్తుతం కొన్ని దక్షిణాది క్రేజీ మూవీస్ .. బహుభాషల్లో విడుదలయ్యేందుకు వ్యూహ రచనలు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కథానాయికల్ని కూడా బాలీవుడ్ బ్యూటీస్ నే ఎంపిక చేయడం.. విశేషంగా మారింది. అందులో భాగంగానే త్వరలో బాలీవుడ్ క్రేజీ గాళ్ .. సోనమ్ కపూర్ ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందని వార్తలొస్తున్నాయి.
బోల్డ్ నెస్ అండ్ హాట్ నెస్ కలగలిసిన కథానాయిక సోనమ్ కపూర్.. అనిల్ కపూర్ తనయగా బాలీవుడ్ తెరపై ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనదైన గ్లామర్ తోనూ, పెర్ఫార్మెన్స్ తోనూ భారతీయ తెరపై సత్తా చాటుతోంది. శ్రద్ధా కపూర్, విద్యా బాలన్, కియారా అద్వానీ లాంటి ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో హీరోయిన్స్ గా సత్తా చాటుకున్నారు. త్వరలోనే దీపిక కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో సోనమ్ కపూర్ సైతం ఇప్పుడు టాలీవుడ్ లో కథానాయికగా ప్రవేశించడానికి సిద్ధమవుతుండడం హాట్ టాపిక్ అయింది.
టాలీవుడ్ లో ఒక క్రేజీ స్టార్ హీరో నటించబోతున్న ఒక పాన్ ఇండియా మూవీలో సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించబోతోందని వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ .. అత్యధిక పారితోషికం ఆఫర్ చేసి.. సోనమ్ కపూర్ ను హీరోయిన్ గా ఎంపికచేశారట. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అనౌన్స్ అవుతాయని అంటున్నారు. మరి సోనమ్ కపూర్ గ్లామర్ .. ఈ సినిమాకు ఏ మేరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.
Must Read ;- ‘రాధేశ్యామ్’ చిత్రం కోసం రూ.30కోట్లతో భారీ సెట్?











