యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ‘భీష్మ’ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ విజయోత్సాహంతోనే ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడితో మల్లూ కుట్టి కీర్తి సురేశ్ తొలిసారిగా జోడీ కడుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలవడానికి రెడీ అవుతోంది. దీని తర్వాత నితిన్ చేయబోయే మూవీ ‘అంధాధూన్’ బాలీవుడ్ రీమేక్.
ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధిక ఆప్టే ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ లో టబు పాత్రను తమన్నా పోషిస్తుండగా.. హీరోయిన్ రాధిక ఆప్టే పాత్రను నభా నటేష్ ధరిస్తోంది. నిజానికి ఈ సినిమాలో టబు పాత్రకోసం ముందుగా మేకర్స్ నయనతారను సంప్రదించారు. అయితే ఆమె ఏకంగా రూ. 9కోట్లు డిమాండ్ చేయడంతో ఆమె ప్లేస్ ను తమన్నా రీప్లేస్ చేసింది.
అసలు విషయానికొస్తే.. ‘అంధాధూన్’ మూవీలో కొన్ని బోల్డ్ అండ్ హాట్ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా టబు, ఆయుష్మాన్, రాధిక నటించిన కొన్ని హాట్ సన్నివేశాల్ని తెలుగులో యాజిటీజ్ గా తెరకెక్కించడం కష్టం. అందుకే ఆ సీన్స్ ను తెలుగులో లైటర్ వేలో ప్రెజెంట్ చేయబోతున్నాడట దర్శకుడు మేర్లపాక గాంధి. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఇంకా ఎలాంటి టైటిల్ అనుకోలేదు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. మరి ఈ మూవీ అంధాధూన్ తరహాలోనే తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుందేమో చూడాలి.











