జీ సంస్థ రిలీజ్ చేసిన తాజా చిత్రం ‘లాహోర్ కాన్ఫిడెన్షియల్’. ఈ మూవీ ఫిబ్రవరి 4 న రిలీజ్ చేసింది. ఇది స్పై థ్రిల్లర్. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనన్య (రిచా చడ్డా) ఒక భారతీయ మహిళ. ఆమె చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హయిగా సాగిపోయే జీవితంలోంచి ఆమె ..హఠాత్తుగా థ్రిల్లింగ్ వరల్డ్ లోకి విసిరివేయబడుతుంది. రౌఫ్ (అరుణోదయ్ సింగ్) ఒక ఆకర్షణీయమైన పాకిస్తానీ సామాజికవేత్త.
అనన్య ఆఫీసుకు వెళ్లడం, వివాహం చేసుకోవడం..ఇలా సాధారణ జీవితాన్ని గడుపుతుంది. భారతదేశం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) లో ఉద్యోగం చేస్తుంది. మరోవైపు, రౌఫ్ ఒక సంపన్న పాకిస్తానీ సోషలిస్ట్. ఉర్ధూ కవిత్వం అంటే ఆయనకు చాలా ఇష్టం. అలాగే అనన్యకు కూడా ఉర్ధూ కవిత్వం అంటే ఇష్టం. ఇలా ఇద్దరికీ ఉర్ధూ కవిత్వం పై ఉన్న ఇష్టం ఇద్దరినీ కలుపుతుంది.
పాకిస్తాన్ ఉర్దూ కవులపై పుస్తకం రాసే ముసుగులో అనన్యను భారత ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ పాకిస్తాన్ కు పంపుతుంది. కానీ ఆమెను పాకిస్తాన్‌కు పంపడం వెనకుఉన్న ఉద్దేశ్యం ఏంటంటే.. ఆమె పాకిస్తాన్ లతో సన్నిహితంగా ఉండి, వసీం అహ్మద్ ఖాన్ గురించి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం. అహ్మాద్ ఖాన్ భారతదేశంలో వాంటెడ్ టెర్రరిస్ట్. అతను భారతదేశంపై వరుసగా దాడులను ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. అనన్య సహచరులు, ముఖ్యంగా యుక్తి (కరిష్మా తన్నా) ఈ ఉద్యోగానికి ఆమె అనర్హులుగా భావిస్తారు.
ఉర్దూ కవిత్వం , పాకిస్తాన్ సంస్కృతి.. రౌఫ్, అనన్య మధ్య స్నేహాన్ని ఏర్పరుస్తుంది. ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే.. అనన్య రౌఫ్ నిజస్వరూపం తెలుసుకోవాలి అనుకుంటుంది కానీ.. అది అంత ఈజీ కాదు. ఈ ప్రపంచంలో స్నేహితులు, శత్రువులు లేరు. ఒకే ఒకటి ఉంది అదే దేశభక్తి. అయితే.. ఈ కథలో హీరోలు ఎవరు.? విలన్లు ఎవరు..? అనేది గంట నిడివి గల ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
రిచా చడ్డా బ్రిలియంట్. అందమైన కళ్లతో భావోద్వేగాలను అద్భుతంగా చూపించింది. అరుణోదయ్ సింగ్ సున్నితమైన మరియు ఆకర్షణీయమైన రౌఫ్ పాత్రలో నటించారు. కరీష్మా తన్నా యుక్తి పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని ఎస్. హుస్సేన్ జైదీ రూపొందించారు. టాలెంటెడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జార్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. థ్రిల్లర్ మూవీస్ కి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కీలకం. ఆ బాధ్యతలను సునీల్ రోడ్రిగ్స్ తీసుకున్నారు. విభ సింగ్ అద్భుతమైన సంభాషణలు అందించారు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ ఆప్ ఫోటోగ్రఫీ కార్తీక్ గణేష్. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. స్పై థ్రిల్లర్స్, రొమాన్స్ మూవీస్ ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది.











