అందం ఎక్కడ ఉన్నా తళుక్కున మెరవడమే దాని లక్షణం .. చటుక్కున మనసు గదుల్లోకి జారిపోవడమే దాని నైజం. ఇక్కడ ఈ ఫొటో చూస్తుంటే అదే ఆలోచన .. అదే ఆనందం కలుగుతోంది. అందాన్ని విల్లులా వచ్చిన తీరుకు విస్మయం కలుగుతుంది కదూ. ఇంతకీ నింగికీ నేలకి మధ్యలో అందాల విన్యాసం చేసిన ఆ సుందరి ఎవరనే ఆసక్తి అంతకంతకూ పెరిగిపోవడం సహజం. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో కూడా కలర్లు కనిపించేలా చేస్తున్న ఈ అమ్మాయి పేరు అలయా ఎఫ్.
పూజా బేడీ – ఫర్హాన్ ఇబ్రహీమ్ గారాల పట్టి అయిన అలయా, బాలీవుడ్లో తన సత్తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ‘జవానీ జానేమన్’ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకి పరిచయమైన ఈ భామ, మరిన్ని మంచి అవకాశాలను అందుకోవడానికి తనవంతు కృషి చేస్తోంది. సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఈ సుందరి బాలీవుడ్ లో కుదురుకోవడానికి బాగానే కష్టాలు పడుతోందట. ఇప్పుడిప్పుడే ఆమె కష్టాలకు తగిన ప్రతిఫలాలు లభిస్తున్నాయని అంటున్నారు.
అలయాకి కథక్ నృత్యంలో మంచి ప్రవేశం ఉంది. డాన్స్ నేపథ్యంలో సాగే కథల్లో కనిపించాలనేది ఆమె ఆశయం. ప్రస్తుతం ఆమె ‘గోవా’లో ఉంది. బికినీతో స్విమ్మింగ్ పూల్లో దూకుతూ ఒక స్టన్నింగ్ షాట్ లో అభిమానులకు ఆమె కనువిందు చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. అయితే అనుకున్నట్టుగా పెర్ఫెక్ట్ షాట్ రావడానికి చాలా సమయమే పట్టిందట. రెండు కాళ్లు .. చేతులు .. తల .. నడుము వెనక్కి వంచుతూ ఆమె స్విమ్మింగ్ పూల్ లోకి దూకే దృశ్యం అద్భుతంగా వచ్చింది. ఇలాంటి పెర్ఫెక్ట్ షాట్ కోసం పదే పదే ట్రై చేయడం వలన ఆమెకి మోకాళ్ల నొప్పులు కూడా వచ్చాయట పాపం. మరి ఈ వినోదాల విన్యాసాలు ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతాయో చూడాలి.
Must Read ;- జలకన్యవా? రాశి ఖన్నావా?










