దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే, కొవిడ్ పై అవగాహన కోసం ప్రజలు రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. హైదరాబాద్ లో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలనే మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని జిల్లెలగూడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి మాస్క్ తొడిగారు. ఇప్పటికీ అనేక మంది కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని, అందుకే రోడ్లపై తిరిగే వారికి కనీసం అంబేడ్కర్ విగ్రహాన్ని చూస్తేనైనా అవగాహన కలుగుతుందనే ఆలోచనతో స్థానిక నేతలు ఈ పని చేశారు. కోవిడ్ కట్టడి కోసం హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి.
చంద్రబాబు బర్త్ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్..
CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....











