ఏపీలో షర్మిల పార్టీ కార్యకలపాలపై ఊపందుకున్న ప్రచారం..!
ఏపీలో రైతులు పడుతున్న ఇబ్బందులపై షర్మిల పోరాడాలని, ఆర్తనాధాలు విని న్యాయం చేసేందుకు ఆమె వస్తారని రైతులు ఇప్పటికే సోషల్ మీడియా కేంద్రంగా ప్రచారం సాగిస్తున్నారు. అదేమిటి?.. ‘అన్న జగన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సోదరి షర్మిల ఏపీలో ఆమె పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించడం ఏమిటని? అనుమానాలు వ్యక్తమవుతున్నా.. కానీ షర్మిల, పార్టీ పెద్దలు మీడియాకు లీకులు వదులుతూనే ఉన్నారు. ఈ లీకులే ఏపీలో షర్మిల.. జగన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ప్రస్థానం సాగించేందుకు సిద్ధమౌతున్నారని అందుతున్నార ప్రచారం ఊపందుకుంది.
బలపరుస్తున్న అనేక పరిణామాలు..!
వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో యువత, రైతులు కోసం పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వ జాబ్ నోఫికేషన్ కోసం గడిచిన రెండేళ్లుగా నిరుద్యోగ యువత వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. యువతకు ఉద్యోగాలిస్తామని ప్రకటించిన సీఎం జగన్ రెడ్డి.. ఉన్న ఉద్యోగుల సమస్యలు, గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లేర్ వంటివి నెరవేర్చలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలో సరిగాలేదు. పంటలన్నీ తీవ్రంగా నష్టపోయి.. అప్పులుపాలయ్యారు. ప్రభుత్వ సాయం కోసం అరులు చాచుతున్నారు. ఈ నేపధ్యంలో బాధిత రైతులు, యువత సోషల్ మీడియా ద్వారా వారి గోడును వైఎస్ షర్మిలకు విన్నవిస్తున్నారు. తెలంగాణ లో మీరు చేస్తున్న పోరాటాలకు మొండి కేసీఆర్ మెడలు వంచుతున్నారని, అలానే ఏపీలో కూడా జగమొండి చర్యల నుంచి రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మొన్న క్రిస్మస్ పండుగ నాడు జగన్, షర్మిల మధ్య వివాదాలు, అప్పుడప్పుడు ఏపీ లో పార్టీ నిర్మాణం పై మీడియా మిత్రులకు షర్మిల ఇస్తున్న లీకులు వంటివి ఏపీ పార్టీ పోరాటాలు చేసే దిశను బలపరుస్తున్నాయి. సోమవారం ఓ కార్యక్రమానికి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో మీడియా ఆయనను ఏపీలో షర్మిల పార్టీ నిర్మాణం పై ప్రశ్నించారు. తాను ఒక కార్యక్రమంపై వచ్చానని, పార్టీకి, తనకు ఎటువంటి సంబంధం లేదని సున్నితంగా తప్పుకున్నారు.