ప్రగతి భవన్ వద్ద మంగళవారం ఇద్దరు యువకులు హల్ చెల్ చేశారు. మంత్రి హరీష్ రావు కాన్వాయ్ మీదకు దూసుకు వెళ్లి వేగంగా వస్తున్న కారు కింద పడి వారు ఆత్మహత్యాయత్నం చేయగా డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. తర్వాత అందులో ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు. వారిద్దరిని అన్నతమ్ములుగా గుర్తించారు.వారెవరు, ఇలా ఎందుకు చేశారన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి బేగంపేట పోలీస్ స్టేషన్కి తరలించి విచారిస్తున్నారు.
Must Read ;- జగన్ క్యాంపు కార్యాలయం వద్ద కలకలం : దంపతుల ఆత్మహత్యాయత్నం