Buddha Venkanna About Jagan
వైసీపీ 22 నెలల పాలనలో లక్షా 80 వేల కోట్ల అప్పులు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి త్వరలో పదవి కోల్పోవడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి జగన్ ప్రత్యేక హోదాను ప్రధాని మోదీ వద్ద తాకట్టు పెట్టాడని బుద్దా వెంకన్న బుచ్చినాయుడు కండ్రిగలో ధ్వజమెత్తారు. 25 మంది ఎంపీలను ఇస్తే మోదీ మెడలు వంచుతానన్న సీఎం జగన్ ప్రస్తుతం 28 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేకహోదా మాట ఎత్తడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
పార్లమెంటులో నోరు తెరవని వైసీపీ ఎంపీలు
వైసీపీ ఎంపీలు పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై నోరు మెదపడం లేదని బుద్దా వెంకన్న విమర్శించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా జగన్‌కు చీమకుట్టినట్టు లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, త్వరలో ఐపీ పెట్టడానికి సిద్దంగా ఉన్నారని, జగన్ సీఎం పదవి కోల్పోవడం ఖాయమని బుద్దా వెంకన్న విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని, దళిత డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడిగా ముద్ర వేశారని బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు.
Must Read ;- వైసీపీకి ఓటెందుకు వెయ్యొద్దో బాబు, లోకేశ్ చెప్పేశారు