మెగాస్టార్ చిరంజీవి వేసిన దారిలోనే ఆయన వారసులు, బంధువుల బిడ్డలు తెలుగు సినిమాల్లోకి హీరోలుగా ఎంట్రీలు ఇచ్చి కెరీర్ సాఫీగా లాగించేస్తున్నారు. ప్రస్తుతం మెగా కాంపౌండ్ నుంచి ఏకంగా 10 మంది హీరోలు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారంటేనే ఈ బ్యాచ్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మెగా మార్క్ ఉన్న హీరోల్లో కూడా చాలా మందికి బయట నిర్మాతలు దొరకడం లేదు. అయితే ఒక్కటి మాత్రం జరుగుతోంది, ఈ మెగా కాంపౌండ్ హీరోల్లో ఎవరికైతే లో ఫ్రొఫైల్ ఉంటుందో వారితో ఎవరైనా నిర్మాత సినిమా తీస్తే, ఈ బ్యాచ్ లో ఉన్న స్టార్ హీరోలు ఆ నిర్మాతలకు డేట్లు ఇస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు సాయిధరమ్ తేజ్ డేట్స్ బుక్ చేసుకున్న వెంటనే, రామ్ చరణ్ డేట్స్ కూడా దొరికేశాయి, ఇప్పుడు ఏకండా ఈ బ్యానర్ వారు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో సినిమాలు చేస్తున్నారు. సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో కూడా ‘ఉప్పెన’ అనే సినిమా తీశారు మైత్రీ మూవీ మేకర్స్. ఇక అసలు విషయానికొస్తే ఈ మెగా కాంపౌండ్ హీరోల్లో బడ్డింగ్ స్టేజ్ ఉన్న వారు ఎవరంటే మాత్రం గుర్తుకు వచ్చే మొదటి పేరు అల్లు శిరీష్ దే, మనోడికి హిట్లు ఉన్నా కానీ ఫేస్ వాల్యూ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయలేకపోతుంది. శిరీష్ తరువాత చిరంజీవి చిన్నఅల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా కెరీర్ లైన్ అప్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వీరితో పాటు వైష్ణవ్ తేజ్, సాయి తేజ్ లు కూడా స్టార్ రేంజ్ కోసం ప్రయత్నిస్తున్నారు.