అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఇందులో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎంత వరకు మెప్పిస్తుందో..? అఖిల్ కి ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో అని తెగ టెన్షన్ పడ్డారు. నాగార్జున అయితే.. మరీనూ ఈసారైనా అఖిల్ కి సక్సెస్ వస్తుందో లేదో అని ఆలోచనలో పడ్డారట. అయితే.. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అంచనాలను మించిన విజయాన్ని సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. 7 రోజుల్లో 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. సెకండ్ వీక్ లోకి సక్సెస్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నాగార్జున ఎడిటింగ్ లో కొన్ని మార్పులు చెప్పారు. రెండున్నరేళ్ళ పాటు సాగింది ఈ చిత్ర నిర్మాణం. అందరూ కలిసి చేసిన మార్పులు చేర్పుల వల్లే ఈ సినిమా ఆడింది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. అఖిల్ కి విజయాన్ని అందించిన బొమ్మరిల్లు భాస్కర్ కి కాదు బ్యాచ్ లర్ భాస్కర్ కి గీతా ఆర్ట్స్ సంస్థ మరో బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఏంటా ఆఫర్ అంటే.. ఇంకో యువ హీరోకి సెట్ అయ్యే కథని రెడీ చేసుకోమని చెప్పిందట. దీంతో భాస్కర్ ఆల్రెడీ తన దగ్గర ఉన్న కథల్లో ఏ కథతో సినిమా చేయాలా అని ఆలోచిస్తున్నాడట. గీతా ఆర్ట్స్ మరో ఆఫర్ ఇచ్చిందని తెలిసినప్పటి నుంచి ఈసారి ఏ హీరోతో సినిమా చేయనున్నాడు..? ఏ జోనర్ లో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది.