పుష్ప 1తో భారీ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కోసం సిద్ధమయిపోయాడు.విడుదల అయిన అన్ని భాషలతో పాటూ ఓవర్ సీస్ లో కూడా కలెక్షన్ ల మోత మోగించిన పుష్ప 1 తో బన్నీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. దీంతో బన్నీ తన కెరీర్‌లోనే మొట్ట మొదటి పాన్ ఇండియా చిత్రంగా పుష్ప 1 తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
ఇక మొదటి భాగం తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ వల్ల బన్నీ ‘పుష్ప ది రూల్’ చిత్రం కోసం తన పారితోషికాన్ని రెట్టింపు చేశాడనే వార్తలొస్తున్నాయి. పుష్ప మొదటి భాగం కోసం అల్లు అర్జున్ ఏకంగా 50 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని టాక్.ఈ క్రమంలోనే ‘పుష్ప ది రూల్’ కోసం బన్నీ తన పారితోషకాన్ని డబుల్ చేశాడట. దీంతో ఈ మూవీకి అల్లు అర్జున్ 100 కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మైత్రీ మూవీస్ వారు కూడా బన్నీ కోరిన విధంగానే అంత ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడానికి అంగీకరించారట.అదే నిజమైతే కెరీర్‌లోనే మొట్ట మొదటి పాన్ ఇండియా చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నా రికార్డు తో పాటు.. అత్యధిక మొత్తాన్ని పారితోషికంగా అందుకోవడం..అదేసమయంలో రెండో భాగానికిగానూ రెట్టింపు పారితోషకం అందుకుంటున్న తొలి హీరోగా ఆ రికార్డు అల్లు అర్జున్ పేరిట నమోదు అవుతుంది.
మరోవైపు ‘పుష్ప ది రైజ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 1 చిత్రం బాలీవుడ్ లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండో భాగమైన ‘పుష్ప ది రూల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ లోపు స్ర్కిప్ట్ లో భారీ మార్పులు చేసేందుకు డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్ ఇప్పటికే వర్కవుట్స్ చేస్తున్నారట. అలాగే రెండో భాగంలో రెండు, మూడు కొత్త పాత్రల్ని ప్రవేశపెడుతున్నారని సమాచారం.మొత్తం మీద బన్నీ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా నిలిచిన పుష్ప 1 లానే పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ రికార్డు సాధిస్తుందా అనేది వేచి చూడాలి.