ఇప్పుడు కుర్రాళ్లకు కునుకులేకుండా .. కుదురులేకుండా చేస్తున్న పేరు ఏదైనా ఉందంటే అది పూజా హెగ్డేనే. నాజూకు సోయగాలతో.. ఘాటైన అందాలను ఆరబోయడం అమ్మడి ప్రత్యేకత. ‘అల వైకుంఠపురములో’ సినిమా తరువాత నుంచి ఈ అమ్మాయిని అంతా బుట్టబొమ్మగా చెప్పుకుంటున్నారు. బుట్టలతో తెచ్చి కుమ్మరించిన పూలరాశిగా కుర్రాళ్లు ఊహించుకుంటున్నారు. పడుచు మనసును పల్లకీని చేసి ఊరేగిస్తున్నారు. అలాంటి ఈ పొడుగుకాళ్ల సుందరి తన లేటెస్ట్ ఫొటో షూట్ నుంచి మత్తుమాత్రలాంటి ఒక స్టిల్ ను వదిలింది.
ఈ ఫొటోలో ఆమె ‘అందం చూడవయా .. ఆనదించవయా.. ‘ అన్నట్టుగా కూర్చుని ఉంది. నిలబడి .. నిలబడి అలసిపోయిన అజంతా శిల్పం అలా కాసేపు రిలాక్స్ అవుదామనుకుని కూర్చున్నట్టుగా ఈ ఫొటోలో ఆమె కనిపిస్తోంది. వంగపువ్వు రంగు డిజైనర్ డ్రెస్ లో ఆమె వంగపువ్వు మాదిరిగానే విరుస్తోంది .. అప్సరసలా మెరుస్తోంది. అందం – ఆకర్షణ కవల పిల్లలే సుమా అన్నట్టుగా చూస్తోంది. పూజా డ్రెస్ పై డిజైన్ .. ఆమె సౌందర్యానికి చెక్కిన నగిషీలుగా అనిపిస్తున్నాయి. ఆ డ్రెస్ గా తాము మారిపోతే తరించిపోవచ్చనే కుర్రాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే, వెన్నెల ఒలకబోసుకున్న చందమామలా .. పరువాలు పారబోసుకున్న పాలరాతి బొమ్మలా ఈ ఫొటోలో పూజా హెగ్డే కనిపిస్తోంది. అందాన్ని నిర్వహించడం అంత తేలికైన పనేం కాదు బాసూ అన్నట్టుగా, కూల్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెగోడలను కూలదోస్తోంది. ఇలా గ్యాలన్ల కొద్దీ గ్లామర్ పెంచేసి, ఈ పిల్ల ఫిరంగీ ఇంకెన్ని అవకాశాలను కొల్లగొడుతుందో ..మరెన్ని మనసులను దోచుకుంటుందో చూడాలి. త్వరలో ఈ గడుసు అందాల గని నుంచి ‘రాధే శ్యామ్‘.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్‘ రానున్న సంగతి తెలిసిందే.
Must Read ;- రష్మిక అనుకుంటే.. పూజా సెట్టయిందా?