కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మంది హోం ఐసోలేషన్ లోనే ఉండటం.. ఇళ్లల్లో బాత్రూంలు షేరింగ్ ఎక్కువగా ఉండటం కూడా కేసుల వ్యాప్తికి కారణమవుతుందని చెబుతున్నారు. టాయిలెట్ ద్వారా కరోనా ముప్పు ఉందనే విషయంపై ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే జర్నల్ లో రీసెర్చ్ చేసింది. దీని ప్రకారం.. నోటి ద్వారానే కాదు.. టాయిలెట్ ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొంది. టాయిలెట్ వాడిన తర్వాత ఫ్లష్ చేసినప్పుడు విడుదలయ్యే నీటి ప్రవాహం వల్ల తుంపరులు చెలరేగుతాయి. కంటికి కనిపించనంత పరిమాణంలో ఉండే కోవిడ్ వైరస్, ఫ్లస్ చేసేటప్పుడు టాయిలెట్ ద్వారా వ్యాపిస్తాయని తేలింది.
మూత వేసి ఫ్లష్ చేస్తే ‘నో‘ వైరస్
టాయిలెట్ల ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండాలంటే.. ఫ్లష్ చేసే ముందు.. షీట్ ను పూర్తిగా మూసేయటం.. అలానే కాసేపు ఉంచటం.. ఆ తర్వాత పూర్తిగా శుభ్రం చేయటం కూడా అవసరమని చెబుతున్నారు. టాయిలెట్ వాడిన తర్వాత ఫ్లష్ చేసేటప్పుడు దాని మూత వేసి ఫ్లష్ చేస్తే బాత్రూం గోడలు, గదిలో తుంపరలు పడకుండా అడ్డుకోవచ్చు. దీనిద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు. ఇలా చేయడం వల్ల వైరస్ భయం తక్కవేనని చెప్తున్నారు డాక్టర్లు.
Must Read ;- కోవిడ్ ఎక్కడ పుట్టిందో నిగ్గు తేల్చండి : జో బైడెన్












