మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా మే 13న విడుదల కాబోతుండడంతో.. సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. త్వరలోనే టాకీ పార్ట్ కంప్లీట్ చేసి రెండో ఆడియో సాంగ్ ను విడుదల చేసే ఆలోచనతో ఉన్నారు మేకర్స్. ఇక దీని తర్వాత చిరంజీవి ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ మీద దృష్టిపెట్టనున్నారు.
తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించబోతున్న ‘లూసిఫర్’ తెలుగు వెర్షన్ .. మొన్నా మధ్య గ్రాండ్ గా లాంఛ్ అయింది. సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్ళాలనుకున్న మేకర్స్ కు .. ఈ సినిమా కేస్టింగ్ ప్రధాన సమస్యైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
లూసిఫర్ తెలుగు వెర్షన్ కోసం ఎంపిక చేసిన నటీనటులకు ప్రస్తుతం పలు కమిట్ మెంట్స్ ఉండడంతో వారి కాల్షీట్స్ ఈ సినిమాకి సంపాదించడం తలనొప్పిగా మారిందట. ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజా వారి డేట్స్ సంపాదించే పనిలో ఉన్నాడట. ఇందులో ప్రధాన పాత్రలు పోషించబోతున్న నయనతార, సత్యదేవ్ లాంటి స్టార్స్ కు సైతం ఈ సినిమాకి డేట్స్ కేటాయించడం సమస్యగా మారిందని తెలుస్తోంది. అందరు నటీనటుల డేట్స్ కుదిరితే.. వచ్చే నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెడతారట. మరి వచ్చే నెలలో అయినా అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.