తిరుమల లడ్డూకు జరిగిన అపవిత్రత విషయంలో ఇప్పుడు గత ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఆ భారీ తప్పిదాన్ని కవర్ చేసుకునేందుకు ఎన్నో రకాల డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికే కల్తీ నెయ్యి రిపోర్టుల విషయంలో అందులో గొడ్డు కొవ్వు నూనె, వెజిటబుల్ ఆయిల్, చేప నూనె కలిసిందని తేటతెల్లం కాగా.. అందుకు కారకులపై విచారణకు ఆదేశించబోతున్నారు. దీంతో ఈ వార్త వింటేనే జగన్ మోహన్ రెడ్డి హడలిపోతున్నారు.
తిరుమల లడ్డూ వివాదంతో విషయంలో వైసీపీ ఇప్పుడు చెప్పలేనన్ని కష్టాలు పడుతోంది. లడ్డూ నాణ్యత వివాదంతో జగన్ కు కూడా క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయింది. దీనిపై కేంద్ర మంత్రులు కూడా వరుసగా స్పందిస్తున్నారు. ఈ వివాదాన్ని సీరియస్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. దానిపై విచారణకు రంగం సిద్దం చేస్తోంది. మరోవైపు, దేశం మొత్తం జగన్ కు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు చేస్తున్నాయి. భోపాల్లో జగన్ బొమ్మలను హిందూ సంఘాలు తగలబెట్టారు. ఆయన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందున ఈ లడ్డూ కల్తీ కావడానికి కారకులైన వారికి మరణ శిక్ష విధించాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. తిరుమల లడ్డూ అంశంపై స్పందించిన కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా దీనిపై స్పందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనదని.. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి అని కోరారు.
ఇక్కడ మరో ఆశ్చర్యకర అంశం ఏంటంటే.. వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా తిరుమల లడ్డూ వ్యవహారంపై మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్ర మంత్రులు ఇలా వరుస పెట్టి ఈ వ్యవహారంపై స్పందించి, జగన్ మోహన్ రెడ్డిని అనుమానించిన తీరు చూస్తుంటే సీబీఐ విచారణ పక్కా అనే సందేహం కలుగుతోంది.