కరోనా టీకా అతి త్వరలో అందుబాటులోకి సమయంలో కేంద్రం ఇప్పటికే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన నివేదిక ఎప్పటికప్పుడు కేంద్రానికి అందివ్వాలని కూడా తెలియజేసింది. ఇలాంటి తరణంలో కరోనా వ్యాక్సిన్ సరఫరా చర్యలను మరింత ముమ్మరం చేసింది. అందులో భాగంగా, సూదులు, సిరంజిలు, టీకా సీసాలు.. ఇలా అన్నింటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఊపందుకున్న చర్యలు
కరోనా టీకా పంపిణీ కోసం 35 కోట్ల సూదులు, టీకా సీసాల, 23 కోట్ల సిరంజిల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. కేంద్రం 60 కోట్ల టీకా డోసులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. తొలి దశలో 30 కోట్ల మందికి టీకాలు వేయడానికి కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. వ్యాక్సిన సరఫరాకు అవసరమైన సీసాలు, సూదులు మన దేశంలో కొరతరాకుండా ఉండడానికి కేంద్రం అంచనాలు సిద్ధం చేస్తుంది. అందుకోసం ముందుగా ఆటోడిజేబుల్డ్ సిరంజిలను వినియోగించాలని నిర్ణయించారు. ఒకవేళ అవి చాలని పక్షంలో సాధారణ సిరంజిలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హెచ్‌ఎండీలో తయారీ..
ఔషధ పరికరాల తయారుచేసే హిందూస్థాన్ సిరంజెస్ అండ్ మెడికల్ డివైజెస్ (హెచ్‌ఎండీ) కి కేంద్ర ప్రభుత్వం కరోనా పరికరాల ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దాదాపు 18 కోట్ల సిరంజిలను 2021 మార్చి నాటికి సిద్ధం చేయాలి. దీనితో పాటు జూన్ నాటికి 100 కోట్ల సిరంజిల ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్ధ ప్రకటించింది. వీటితో పాటు 120 కోట్ల వ్యాక్సిన్ సీసాల ఉత్పత్తికి చెందిన ఆర్డర్ ప్రముఖ ఫార్మా ప్యాకేజింగ్ సంస్థ దక్కించుకుందని సమాచారం.
Must Read ;- భారత్ కోసం ధర సవరించనున్న ఫైజర్