మాజీ ముఖ్యమంత్రి స్థలానికే రక్షణ లేకపోతే ఎలా?
జగన్ రెడ్డి పాలనలో ప్రజల ప్రాణాలకు,ఆస్తులకు రక్షణ కరువైంది! యథేచ్చగా ప్రైవేటు, పబ్లిక్ స్థలాల కబ్జాకు పాల్పడమేకాక, అదేమిటని ప్రశ్నించిన ప్రజలను, ప్రభుత్వ అధికారులను బెదిరించడం, దాడులు చేయడం కామన్ గా మారింది. ఇటీవల విశాఖలో ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి భూమిని, మరో ప్రభుత్వం స్థలాన్ని అధికార పార్టీకి చెందిన నేతలు కబ్బా చేశారు. దీని ప్రశ్నించిన వారిని బెదించడంమేకాక, సదరు రెవిన్యూ అధికారులపై కూడా దాడి చేసిన ఘటనలు విదితమే! ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూర నాయుడు 1989లో సర్వే నెంబర్ 222/5 లో 87 సెంట్ల భూమిని నారావారిపల్లెలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమి కబ్జాకు గురైంది. నారావారిపల్లెకు చెందిన రాజేంద్ర నాయుడు ఈ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు స్థానిక టీడీపీ నాయకులు. అయితే ఈ 87 సెంట్ల భూమిలో కొంత భూమిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణ చేయగా.. మిగిలిన 38 సెంట్ల భూమి అలానే ఉంచారు. ప్రతి ఏటా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇదే స్థలంలో సంక్రాంతి సంబరాలు కూడా చేస్తుంటారు. రంగువల్లులు, క్రీడా పోటీలు వంటివి ఇక్కడే నిర్వహిస్తుంటారు.
ఒక్క సాకుతోనే ఈ సాహసం!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె లో 38 సెంట్ల భూమి కబ్జాకు గురైంది. ఈ దుస్సాహసానికి వడికట్టింది అదే గ్రామానికి చెందిన రాజేంద్రనాయుడుగా తేలింది. అయితే తన తండ్రి ద్వారా ఆస్తిగా చంద్రబాబుకు సంక్రమించి ఈ భూమి.. రెవిన్యూ రికార్డు ప్రకారం ఆన్లైన్ లో ఎక్కలేదు. అదే అదునుగా భావించిన రాజేంద్ర అనే వ్యక్తి రాత్రికిరాత్రే స్థలాన్ని కబ్జా చేశారు. స్థలం చుట్టు ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ భూమికి సంబంధించిన పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉండటంతో నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ చంద్రగిరి ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై రెవిన్యూ అధికారులు నేటికి స్పందించకపోవడం గమనార్హం!
Must Read:-పల్నాడులో అధికారపార్టీ కండకావరం..! టీడీపీ లక్ష్యంగా దాడులు!!