టీమిండియా స్పిన్నర్ చాహల్ దంపతులు విహారయాత్రలో ఊయలలూగుతున్నారు. లాక్‌డౌన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీరు… డిసెంబర్‌లో ఒక్కటయ్యారు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ తర్వాత విశ్రాంతి దొరికిన సమయంలో వీరిద్దరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత విశ్రాంతి దొరకడంతో చాహల్ అదే సమయంలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా ధనశ్రీని వివాహమాడారు.
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన చాహల్ దంపతులు ప్రస్తుతం అలా అలా విహరిస్తున్నారు. ప్రముఖ వెకేషన్ డెస్టినేషన్ మాల్దీవ్స్‌కు వెళ్లి.. ఎంజాయ్ చేస్తున్నారు. ఆహ్లాదకరమైన సముద్ర జలాల్లో సరదాగా విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రస్తుతం.. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Must Read ;- అందం.. అల్లరి కలిస్తే కోహ్లీ : అనుష్క శర్మ