నింగిలోని చందమామకి రాజు ,పేద తారతమ్యం ఉండదు. అందరి పైనా సమభావంతో వెన్నెలను కురిపిస్తుంది. సరిగ్గా టాలీవుడ్ చందమామది కూడా అదే కాన్సెప్ట్ అనుకుంటా. ఆవిడగారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్, జూనియర్ అనే తేడాలేమీ పెట్టుకోకుండా.. అందరు హీరోలతోనూ ఒకే రేంజ్ లో రొమాన్స్ పండించడమే పనిగా పెట్టుకుంది. ఆమె ఎంపిక చేసుకొన్న సినిమాల లిస్ట్ చూస్తే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబో మూవీ ‘ఆచార్య’లో కథానాయికగా కాజల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ముందుగా త్రిషని అనుకున్నా ఫైనల్ గా కాజల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇంతకుముందు చిరుతో ఖైదీనెం.150 లో కాజల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అందుకే ‘ఆచార్య’కి కూడా ఆమె ప్రెజెన్స్ ప్లస్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడు. అలాగే.. లోకనాయకుడు కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’ లో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇలా.. ఇద్దరు సీనియర్ హీరోలతోనూ ఒకేసారి రొమాన్స్ కు సిద్ధపడ్డ కాజల్ .. మరో పక్క యంగ్ స్టార్స్ తో కూడా నటించేందుకు వరుస సినిమాల్ని లైన్ లో పెట్టుకుంది. సూర్య వెట్రిమారన్ కలయికలో రానున్న వడివాసల్ అనే మూవీలో కథానాయికగా ఎంపికైంది.
అలాగే కొరియో గ్రాఫర్ బ్రిందా గోపాల్ మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహిస్తోన్న ‘హాయ్ సినామిక’లో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది కాజల్ . జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటిస్తోన్న ‘ముంబై సాగా’ బాలీవుడ్ మూవీలోనూ చందమామ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వాటితో పాటు అమ్మడు.. మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘మోసగాళ్ళు’ మూవీకి సైతం తనదైన గ్లామర్ టచ్ ఇవ్వబోతోంది. సో… మొత్తం మీద కాజల్ అగర్వాల్ .. చిన్న హీరో , పెద్ద హీరో అనే తారతమ్యాలు పెట్టుకోకుండా.. అందరి సరసన రొమాన్స్ కు సిద్ధపడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి వీరిలో కాజల్ కు మరింత గా క్రేజ్ తెచ్చిపెట్టే హీరో ఎవరవుతారో చూడాలి.











