నిధులు పక్కదారి పట్టించి అభివృద్ధిని గాలికొదిలేశారు..
రాష్ట్ర ఆదాయాన్ని, కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారిపట్టించి, అభివృద్ధిని గాలికొదిలేశారని జగన్ రెడ్డి ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమొత్తారు. నరేగా నిధులు అక్షరాల రూ. 26 వేల కోట్లను ఏమైయ్యాయని నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అభివృద్ధి శూన్యమని చెప్పుకొచ్చారు. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల నుంచి తెదేపా తరుపున గెలుపొందిన సర్పంచ్లతో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, గ్రామ పరిపాలన, అభివృద్థిని కుంటుపరుస్తున్న తీరుపై సర్పంచ్ లకు వివరించారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సర్పంచ్ లకు చంద్రబాబు సూచించారు.
గ్రామ సర్పంచులపై చిన్నచూపు..
వాలంటీర్ల కోసం ప్రజల ఎన్నుకున్న సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పంచాయతీ వ్యవస్థను నర్వీర్యం కాకుండా పోరాడాల్సిన బాధ్యత సర్పంచ్ లదే అని ఆయన గుర్తు చేశారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని స్థానిక ప్రజాప్రనిధులకు చంద్రబాబు సూచించారు. ఫైనాన్స్ నిధులు పంచాయితీలకు ఇవ్వకుంటే డిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలని, ఆ దిశగా పార్టీ తరుఫున కార్యాచరణ రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.
Must Read:-ఏపీలో ఉగ్రవాదులకు మించిన పాలన సాగుతోంది! – చంద్రబాబు