చంద్రబాబునాయుడికి రాజకీయాల్లో అపరచాణక్యుడనే పేరుంది. దూర దృష్టితో ఆలోచించడంలో ఆయనకెవరూ సాటిరారు. చంద్రబాబు తన కొత్త టీమ్‌తో నూతన కమిటీలను ఏర్పాటు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు సరికొత్త ప్లాన్‌తో కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. కీలక పార్టీ పదవులల్లో యవనాయకులనే నియమించడం ద్వరా టిడిపి యువపార్టీ అనే చెప్పుకునే ప్రయత్నం చేశారు. యంగ్ జనరేషన్‌ను ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో పార్టీపై మంచి అభిప్రాయం వస్తుందనే ఉద్ధేశంతో యువకులకు కమీటీలల్లో ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లు తెలుస్తోంది. యువకులకు జిల్లాల్లో పార్టీ పగ్గాలు అప్పగించి, సీనియర్లకు పర్యవేక్షణ బాధ్యతను చంద్రబాబునాయుడు అప్పగించారు. అటు యువతకు ఇటు సీనియర్లకు సముచిత స్థానం కల్పించారు. అలాగే ఏపీలో త్వరలోనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గం జిల్లాగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నూతనంగా 25 మంది అధ్యక్షులను చంద్రబాబు నియమించారు.
యువతకు పట్టం..
కొత్తగా నియమించిన ఈ అభ్యర్థుల సగటు వయస్సు 52 సంవత్సరాలు. ఉత్తరాంధ్రకు చెందిన టి.కాపు నాయకుడు కిమిడి నాగార్జున్ వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. ఆయనను విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షునిగా టిడిపి నియమించింది. తద్వారా కొత్త తరాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చే ప్రయత్నం తమ పార్టీ చేస్తుందనే సందేశాన్ని తెలిపినట్లయింది. రాజకీయాల్లో యువత ప్రాభల్యం జరిగిన గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపింది. యువతను రాజకీయాల్లో తీసుకొచ్చేందుకు, ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి.
పిఆర్సి విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుత లోక్ సభ ఎంపిల సగటు వయస్సు 54 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుత(17వ లోక్ సభ) సెషన్లో ఉన్న 53 మంది ఎంపీలు 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న వారే ఉన్నారు. మిగతా 189 మంది 41 నుంచి 55 సంవత్సరాల మధ్య వారే ఉన్నారు. అలాగే గతంలో పరిశీలిస్తే లోక్ సభ(1952) మొదటి సెషన్లో 20శాతం మంది ఎంపీలు 56 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు. అదే 15వ(2009) లోక్ సభ సెషన్లో ఆ సంఖ్య 43శాతంకి పెరిగింది.
యువతను ఆకర్షించేలా..
డబ్బు, వారత్వ పలుకుబడి వాటికి తావివ్వకుండా యువతను రాజకీయాల్లో ప్రోత్సహించేలా చంద్రబాబు ఈ నియామకాలను చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో యువరక్తం టిడిపి పార్టీవైపు మొగ్గు చూపే విధంగా రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లను ప్రభావితం చేయొచ్చనే ముందు చూపుతో యువతతో కమిటీలను ప్రకటించినట్లు భావిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాలకు చెందిన నేతలకు సమ ప్రాధాన్యమిచ్చేలా కొత్త టీమ్‌ను చంద్రబాబు ఏర్పాటు చేశారు.