రైతుల సమస్యలను ప్రస్తావిస్తున్న సమయంలో ప్రభుత్వం స్పందన అసమంజసంగా ఉండడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రెచ్చిపోయారు. ఆయన తన సీటు లోంచి లేచి.. ఆవేశంగా.. వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.
పంచాయతీ రాజ్ చట్టంపై సవరణల కు నిరసనగా తెలుగుదేశం వాకౌట్ చేసి, తిరిగి సభలోకి వచ్చిన తర్వాత.. ఇది జరిగింది. ఆవేశంతో ఊగిపోతూ.. వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ఆ వెంటనే.. స్పీకరు పోడియం ఎదుటకే వచ్చి బైఠాయించారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు కూడా బైఠాయించారు.











