స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పై విడుదలైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం స్వామి వారి దర్శనానికి తిరుమల వెళ్లేందుకు ప్రయాణం కాగా.. కొన్ని అనివార్య కారణాలతో ఆ టూర్ వాయిదా పడింది.
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషల్ కస్టడీలో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య పరిస్ధితిలు చుట్టిముట్టి వేధించాయి. దీంతో చంద్రబాబు తరుఫున న్యాయవాదులు హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ ను మూవ్ చేశారు. దీంతో చంద్రబాబు హెల్త్ రిపోర్టులను పరిశీలించిన జస్టిస్ మల్లిఖార్జునరావు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు.
ఈ నేపధ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పెద్దఎత్తున తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరిన చంద్రబాబుకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ శ్రేణులు చంద్రబాబుకు అడుగడునా బ్రహ్మరథం పట్టారు. భారీ స్వాగత ఏర్పాట్లతో పార్టీ అధినేతపై ఉన్న ఆపార అభిమానాన్ని చాటుకున్నారు.
మరోవైపు బుధవారం ఉదయం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి.. శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి మరి క్షీణిస్తుండడంతో అత్యవసరంగా వైద్య చికిత్స అవసరం కాబట్టి .. ఆయనను హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. మరోవైపు కోర్టు ఉత్తర్వులకు లోబడి కూడా తిరుపతి టూర్ ను తాత్కాలికంగా బ్రేక్ వేస్తునట్లు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ప్రకటించారు. చంద్రబాబుకు పర్సనల్ డాక్టర్లతో మరిన్నీ పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. దీంతో చంద్రబాబు బుధవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో తన నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందజేయనున్నారు.