ఏపీ ప్రభుత్వం పనితీరును ప్రశ్నించినందుకు జర్నలిస్టు శివప్రసాద్ ఇంటి తలుపు తట్టిన పోలీసులు, ఆయనను కిడ్నాప్ చేశారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. హైదరాబాదులో జర్నలిస్టు అరెస్టుపై ఆయన ట్వీట్ చేశారు. తలుపు తట్టిన పోలీసులు, కుటుంబ సభ్యుల ఎదుటే ఆయనను కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. మానవ హక్కులను పరిరక్షించే చట్టాలను వారు ఈ చర్యతో అవహేళన చేశారని ఆక్షేపించారు. పత్రికా స్వేచ్ఛను హరించి వేసే ఇలాంటి చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
Policemen knocked on the door of journalist Siva Prasad for questioning the AP Govt & kidnapped him in front of his family in Hyd. They have flouted the law that protects an individual’s human rights. I strongly condemn this incident which threatens the freedom of the Press. pic.twitter.com/BsFUkihDRW
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 28, 2020