పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయంలో కింద కూర్చుని ధర్నా చేశారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రేణిగుంట పోలీసులు చంద్రబాబుకు నోటీస్ అందజేశారు.
టీడీపీ నేతల గృహనిర్బంధం
మరోవైపు చంద్రబాబు చిత్తూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నాయకుడు నర్సింహయాదవ్‌లను పోలీసులు నిర్బంధించారు.