విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ – AMTZ అరుదైన రికార్డు సాధించింది. ఇండియాలోని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి AMTZ ఓ కీలక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో భారత ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ సూద్ 2024–25 సంవత్సరానికి సైన్స్ అండ్ టెక్నాలజీ – క్లస్టర్‌ల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక AMTZలో ఉన్న వైజాగ్ సైన్స్ & టెక్నాలజీ క్లస్టర్ – VSTCని దేశంలోని ఎనిమిది కీలక ఆవిష్కరణా కేంద్రాలలో ఒకటిగా గుర్తించింది.
…………….
2024లో స్థాపించబడిన వైజాగ్ సైన్స్ & టెక్నాలజీ క్లస్టర్- VSTC ఇండియాలోని S&T క్లస్టర్‌లలో అన్నిటికంటే చిన్నది. ఐనప్పటికీ మెడికల్ టెక్నాలజీ, ఆటోమేషన్, సర్క్యులర్ ఎకానమీ, అడ్వాన్స్‌డ్ మెటిరీయల్స్, ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ లాంటి రంగాలలో అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచింది. AMTZ నేతృత్వంలోని VSTC క్లస్టర్ పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌ల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
…………..
ఆసియాలోనే AMTZ అతిపెద్ద మెడికల్ టెక్నాలజీ పార్క్. ఈ పార్క్ ఇప్పటికే అధ్భుతమైన ఫలితాలనిచ్చింది. ఈ-యంత్రం ప్రాజెక్ట్ వీటిలో ఒకటి. నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ సాయంతో చేపట్టిన ఇ – వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ అయింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, వాటిని విడదీయడంతో పాటు రీసైక్లింగ్ చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇక కార్డియాక్ కేర్ రంగంలోనూ దేశీయంగా పేస్ మేకర్ లీడ్స్‌ల అభివృద్ధికి VSTC సహకారం అందించింది.
……………
దీంతో కూటమి ప్రభుత్వం AMTZను మరింత విస్తరించాలనే ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగా ఫేజ్ – 3లో భాగంగా మరో 400 ఎకరాలకు కేటాయించాలని ప్రతిపాదించింది. ఇప్పటికే ఫేజ్ – 1, ఫేజ్ – 2 లో కేటాయించిన భూములకు అద్భుతమైన డిమాండ్ వచ్చింది.
లోకేష్ ప్రజా దర్బార్ సూపర్ హిట్… ఫీడ్ బ్యాక్ అదుర్స్..
మంత్రి నారా లోకేష్..ఎంత బిజీగా ఉన్నా, సామాన్యుల కోసం, కార్యకర్తల కోసం తన...











