ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెద్ద రిలీఫ్ దక్కింది. గత ప్రభుత్వం వారికి ఇచ్చిన అవమానకరమైన విధుల నుంచి ప్రస్తుత ప్రభుత్వం తప్పించింది. దీంతో కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. గత జగన్ సర్కారు టీచర్లకు ఓ గలీజు పనిని అప్పగించింది. గవర్నమెంట్ టీచర్లు పాఠశాలలకు వెళ్ళి ఉదయాన్నే బాత్ రూంలు ఫోటోలు తీసి.. యాప్ లో అప్లోడ్ చేయాలని గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనిపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. అయినా అప్పటి జగన్ ప్రభుత్వం వారి మాటలు వినలేదు. ఇక చేసేది లేక ఉపాధ్యాయులు అంతా ప్రభుత్వం చెప్పినట్లే చేయాల్సి వచ్చింది.
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాత్ రూం ఫొటోల క్యాప్చరింగ్ యాప్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్లుగా ప్రభుత్వం పెట్టిన రూల్స్ దెబ్బకు ప్రభుత్వ టీచర్లు భయపడిపోయిన పరిస్థితి ఉంది. ఇతర ఉద్యోగులను కూడా బాగా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రం చాలా నీచంగా ఉపయోగించుకున్నారు. దీనిపై చాలా ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చినా కూడా జగన్ సర్కారు మొండిగా ముందుకు వెళ్లింది. దీనిపై అప్పట్లో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా చాలా పోరాటాలు చేసిన పరిస్థితి. మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళు వైసీపీని వ్యతిరేకించడానికి కారణం అదే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రస్తుత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
బాత్ రూం ఫొటోల క్యాప్చరింగ్ యాప్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలలకు వెళ్ళి ఉదయాన్నే బాత్ రూంలు ఫోటోలు తీసి.. యాప్ లో అప్లోడ్ చేయాలనే తొలగించడంతో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. పైగా గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ, డీఆర్‌లతో పాటు మ్యారేజ్ అడ్వాన్స్, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్, హెచ్‌బీఏ, వెహికల్ లోన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటివి సకాలంలో అందేవి.
కానీ, జగన్ పాలనలో మాత్రం ప్రతి నెలా జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన దుస్థితి వారికి ఎదురైంది. దీంతో ఈఎంఐలు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ఉద్యోగులు వేదన చెందేవారు. తమకు ఇవ్వాల్సి పెండింగ్ బకాయిల కోసం కూడా ఉద్యోగులు పోరాటం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. జీతాలు ఒకటో తేదీన ఇచ్చేలా చట్టాలు చేయాలంటూ అప్పట్లో పోరాటం చేశారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం జీతాలను మొదటి తారీఖునే ఇస్తోంది.