తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయన మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. 32 రోజులుగా చంద్రబాబు జైలు గోడలకు పరిమితం అయ్యారు చంద్రబాబు. ఈ కేసులో సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. కోర్టుకు హాజరుపర్చగా 10న జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు.
ఈ నేపథ్యంలో ఏసీబీ.., హైకోర్టు..,సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు వేసిన చంద్రబాబు వాటిపై వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఉన్నట్లు ఉండి చంద్రబాబు జైల్లో తీవ్ర అస్వస్థతక గురయ్యారు. ఎండ తీవ్రతో జైల్లో డిహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. నాలుగు రోజులు ఎండ తీవ్రంగా పెరగడంతో డీహైడ్రేషన్ బారిన పడ్డారు. ఉక్కపోత విషయాన్ని జైలు వైద్యాధికారుల తెలియజేశారు చంద్రబాబు. ములాఖత్ సమయంలో కూడా కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజెప్పినట్లు తెలుస్తోంది.











