NTR జిల్లా ఘనమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని NTR జిల్లా ఘనంగా ప్రారంభించింది. సంపద సృష్టిలో దూసుకెళ్తోంది. ఈ లెక్కలు వింటే జగన్‌కు గుండెలు అదరడం ఖాయం. NTR జిల్లా తొలి 6 నెలల్లోనే గతేడాది మొత్తంగా సాధించిన GDDPని క్రాస్ చేసింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీ రోల్ ప్లే చేసే దిశగా జిల్లా అడుగులు పడుతున్నాయి. తలసరి ఆదాయం కూడా జిల్లాలో భారీగా పెరిగింది. నియోజకవర్గాల వారీగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లోనూ దూసుకెళ్లింది. సర్వీస్ సెక్టార్‌లోనూ ఈ ఏడాది NTR జిల్లా అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రధానంగా ఐటీ, కమ్యూనికేషన్స్, టూరిజం రంగాల్లో గణనీయమైన వృద్ధి కనబరిచింది.
……………..
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలలో భాగంగా NTR జిల్లా 2025- 26 ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించింది. జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి ప్రస్తుత నెలకు చూస్తే రూ. 1,12,057 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇదే GDDP రూ.94,561 కోట్లుగా ఉంది. ఐతే ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా చాలా నెలల సమయం ఉంది. మొదటి అర్ధసంవత్సరం ముగియడానికి మరో 2 నెలల సమయం ఉంది. రెండవ అర్ధ సంవత్సరం ఇంకా మిగిలే ఉంది. తాజా గణాంకాలు చూస్తే ఈ ఏడాది రాష్ట్ర వృద్ధిలో ఎన్టీఆర్ జిల్లా గణనీయమైన పాత్ర పోషించబోతున్నట్టు అర్థమవుతోంది. ఎన్టీఆర్ జిల్లా తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 4,17,412లుగా తలసరి ఆదాయం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 3,53,150లు మాత్రమే ఉంది.
……………..
వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఎన్టీఆర్ జిల్లా గణనీయంగా అభివృద్ది చెందింది. అన్ని రంగాల్లో కూడా GVA – గ్రాస్ వాల్యూ యాడెడ్ బాగా పెరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ.12,632 కోట్లు వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,895 కోట్లు GVA సాధించింది. పరిశ్రమల రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి రూ. 21,021 కోట్లు GVA సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.17,728 కోట్లు మాత్రమే జీవీఏ సాధించింది. సేవా రంగంలో ఈ ఆర్థిక సంవత్సరం అత్యధికంగా రూ.69,220 కోట్ల GVA సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.58,628 కోట్ల ఆదాయం సాధించింది. తొలి అర్ధసంవత్సరం లోపే 3 ప్రధాన రంగాల్లో స్పష్టమైన వృద్ధిని సాధించి రికార్డు సృష్టించింది.
……………..
నియోజకవర్గాల వారీగా గణాంకాలు –
జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల వారీగా సాధించిన వృద్ధి గణాంకాలను కూడా ప్రభుత్వానికి జిల్లా అధికారులు సమర్పించారు. తిరువూరు నియోజకవర్గంలో వ్యవసాయ రంగంలో రూ.4,110 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.2,487 కోట్లు, సేవా రంగంలో రూ.4,705 కోట్ల జీవీఏ సాధించగా..రూ.3,97,140 తలసరి ఆదాయాన్ని పొందింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యవసాయ, పరిశ్రమలు, సేవా రంగాల్లో రూ.42 కోట్లు, రూ. 2,406 కోట్లు, రూ.16,979 కోట్లు ఆదాయం లభించగా, రూ.4,65,241 తలసరి ఆదాయం ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వరుసగా రూ.141 కోట్లు, రూ.2,858 కోట్లు, రూ.13,809 కోట్ల GVA సాధించగా, రూ.3,98,657 తలసరి ఆదాయం ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో రూ.48 కోట్లు, రూ.2,817 కోట్లు, రూ.11,623 కోట్ల జీవీఏ సాధించగా.. రూ.4,73,803 తలసరి ఆదాయం ఉంది. మైలవరం నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వరుసగా రూ.3,199 కోట్లు, రూ.4,135 కోట్లు, రూ.8211 కోట్లు GVA సాధించగా.. రూ.4,12,803 తలసరి ఆదాయం లభించింది. నందిగామ నియోజకవర్గంలో పై రంగాలలో వరుసగా రూ. 2,106 కోట్లు , రూ. 2,119 కోట్లు, రూ.4,720 కోట్లు GVA సాధించగా రూ. 3,43,328 తలసరి ఆదాయం సాధించింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పై మూడు రంగాలలో వరుసగా రూ. 2604 కోట్లు, రూ. 3324 కోట్లు, రూ.5545 కోట్లు GVA సాధించగా.. రూ. 3,75,099ల తలసరి ఆదాయాన్ని సాధించటం జరిగింది. మొత్తంగా సంపదసృష్టించి పేదలకు పంచుతామని చంద్రబాబు చెప్తుంటే సెటైర్లు వేసే వైసీపీ నేతలకు NTR జిల్లా చెంపదెబ్బ కొట్టే సమాధానం ఇచ్చిందనే చెప్పాలి.











