ఉత్తరాంధ్రలో 3 రోజులు చంద్రబాబు…. జగన్ గుండెల్లో టెన్షన్..!!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన విజన్ 2047, ఉత్తరాంధ్రలో మూడురోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజున విశేష స్పందన వచ్చింది. విశాలపట్నంలోని బీచ్ రోడ్ మీదుగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర సక్సెస్ అయింది. అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. పాదయాత్రలో వేల మంది పాల్గొన్నారు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ నినాదాలతో బీచ్ రోడ్ హోరెత్తింది.విజన్ 2047 పత్రాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు పాదయాత్రలో అనేక మంది యువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, వివిధ సంఘాల నాయకులూ, ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖులు, రైతులు, నగరవాసులు, టీడీపీ మద్దతుదారులు పాల్గొన్నారు.
అయితే చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఉత్తరాంధ్ర టూర్ సీఎం జగన్ ని కలవరపాటుకు గురిచేస్తోంది. చంద్రబాబు పర్యటన దేనికోసం చేస్తున్నాడో కనుక్కోవాలని సీఎం జగన్ ఒక కమిటీని నియమించిందని తెలుస్తోంది. హుటాహుటిన అందరిని హాజరు పరిచి ఉత్తరాంధ్రలో ఏమి జరుగుతోందో నాకు తెలియాలి అని అందరికి హుకుం జారీచేశాడట సీఎం జగన్. టీడీపీ అధ్యక్షుడు ఉన్నటుండి ఉత్త్తరాంధ్ర పర్యటన ఎందుకు చేస్తున్నాడో తెలియక వైసీపీ నాయకులకి కొత్త భయం పట్టుకుందని తెలుస్తోంది.
అయితే సీఎం జగన్ ఊహించింది వేరు అక్కడ చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చింది వేరు. టీడీపీ యెక్క విజన్ 2047 పేరుతో భవిష్యత్తులో ఆంధ్రని ఎలా అభివృద్ధి చేయాలో అని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళబోతున్నాం అని ప్రజలకి తెలియజేసాడు. రాబోయే రోజులలో మేము అందించబోయే సేవాకార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు, రైతులకి ఉపయోగపడే విధంగా ప్రణాళికబద్దంగా వెళ్ళాలి, అలాగే పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తన కళ అని వెల్లడించాడు. అలాగే బి ఫోర్ మోడల్ అని ఒక కొత్త ఆలోచనతో , ప్రణాళికని అతిత్వరలోనే చెప్తాను అని చంద్రబాబు నాయుడు తెలియజేసాడు.
చంద్రబాబు నాయుడు మూడురోజుల పాటు తల పెట్టిన పర్యటనలో అనేక అంశాలు చర్చించారు. విజన్ 2047లో భాగంగా టీడీపీ అధ్యక్షుడు 5 అంశాలను ప్రస్తావించారు. వచ్చే పది సంవత్సరాలలో భారత్ నెంబర్ వన్ అవుతుందని చెప్పాడు. ఇందులో మొదటగా డ్రాఫ్ట్ విజన్ ను ప్రజల ముందుకు తెస్తున్నాననీ దీనిపై మేథావులు, నిపుణులు స్పందించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. అయితే ఇప్పుడు టీడీపీ విజన్ 2047 ఎన్నికలకి మెయిన్ పునాది పడబోతోందని తెలుస్తోంది. అలాగే వైసీపీ నాయకులు ఈ విజన్ 2047 పై ఏ ఒక్కరు కూడా నోరు మెదపటం లేదు.