కియా.. మేడ్ ఇన్ ఆంధ్రా కారు.. ఈ కార్ల ఫ్యాక్టరీ ఏపీకి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించారు.. ఎన్నో రాష్ట్రాలతో పోటీ పడి మరీ కియా టాప్ మేనేజ్‌మెంట్‌ని ఒప్పించి ఏపీకి తీసుకు రావడంలో విజయం సాధించారు చంద్రబాబు.. ఈ కార్ల ఫ్యాక్టరీని తరిమి కొట్టాలని, ఆ కంపెనీని తీసుకు రావడంలో క్రెడిట్ తీసుకోవడానికి రెస్పెక్టెడ్ రెడ్డి సార్ ప్రయత్నించారనే విమర్శలు ఉన్నాయి..
కియా ఫ్యాక్టరీ వస్తే ఏం జరుగుతుంది..?? కరువు సీమ అనంతపురం జిల్లా తలరాతను మారుస్తుందా అని ప్రశ్నించిన వారు ఉన్నారు.. వారికి నేడు కియా ప్రారంభమయిన ఆరేళ్లలో ఎలాంటి ప్రగతి సాధించింది..?? ఎంతమందికి ఉపాధి కల్పించింది…?? రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లను పన్నుల రూపంలో అందించిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.. చంద్రబాబుని డెపలప్‌మెంట్ రాజకీయాలకి కేరాఫ్‌గా, అభివృద్ధికి అడ్రస్‌గా ఎందుకు కీర్తిస్తారో అర్ధం అవుతుంది..
కియా ప్రారంభమయిన షార్ట్ టెర్మ్‌లోనే ఆంధ్రప్రదేశ్‌లో తన స్పీడ్‌ని పెంచింది.. భారతదేశంలో ఏపీని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ హబ్‌లలో ఒకటిగా మార్చింది. $1.1 బిలియన్లకు పైగా (రూ. 13,500 కోట్లు) పెట్టుబడితో కియా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.. అనంతపురంలో 536 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచ స్థాయి తయారీ సౌకర్యంతో, కియా ప్లాంట్ ఏడాదికి 300,000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2019 నుండి ఇప్పటికే 500,000 కంటే ఎక్కువ యూనిట్లను తయారు చేసింది.
కియా ఈ ప్లాంట్‌లో ప్రత్యక్షంగా 3,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.. 11,000 కంటే ఎక్కువ మందికి ప్రత్యక్షంగా, 7,000 కంటే ఎక్కువ మందికి పరోక్ష ఉద్యోగాలను సృష్టించింది. దాదాపు 75% మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అనంతపురం జిల్లా నుండి తీసుకోబడ్డారు. అదనంగా, కియా దాని విక్రేతలు మరో రూ. 4,790 కోట్లు పెట్టుబడి పెట్టారు.. ప్రాంతం అంతటా 6,600 మందికి ఉపాధి కల్పించారు. ఇటు, ఈ ఆరేళ్లలో రాష్ట్రానికి కొన్ని వందల కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో అందించింది కియా..
గత వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. కియా మేనెజ్‌మెంట్‌ని వేధించిందనే ఆరోపణలు ఉన్నాయి.. తమకు వాటాలు ఇవ్వకపోతే అంతు చూస్తామని వేళ్లు చూపి మరీ వేధించిన విజువల్స్ క్లియర్‌గా కనిపించాయి.. ఏది ఏమైనా ఏపీకి కియా చేసిన, చేస్తున్న సేవ అపూర్వం.. చంద్రబాబు విజన్, ఆయన డెవలప్‌మెంట్ పాలిటిక్స్‌కి కియా ఒక అద్భుతమైన సాక్ష్యం.











