త్రిశూల వ్యూహం.. ఇక దబిడి దిబిడే..!
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో త్రిశూల వ్యూహం వడివడిగా అడుగులు వేస్తోంది. ముక్కోణపు వ్యూహంతో ముందుకు సాగుతున్న మేటైనా రాజకీయం దాటికీ.. తాడేపల్లి ప్యాలెస్ లో అవినీతిమయ సంకేళ్ళుతో బంధియై ఉన్న పిల్లికి ముచ్చేమటలు పడుతున్నాయి.
2019 లో తిరుగులేని సీట్లిచ్చి అమరావతి సింహానాన్ని ప్రజలు అప్పగించడంతో కళ్ళు నెత్తికెక్కినట్లు పొలిటికల్ సీనియర్, హేమాహేమీలను మట్టికరిపించిన రాజకీయ దురందరుడైన చంద్రబాబును తక్కువ అంచన వేశాడు జగన్. ప్రజా వేదిక కూల్చి.. అమరావతిని సర్వనాశనం చేసి.. రైతులను రోడ్డుకీడ్చేలా చేసి.. చిత్ర విన్యాసాలు చేశాడు. తాను కొడుతున్న దెబ్బలకు చంద్రబాబు పొలిటికల్ గా ఫినిష్ అయ్యారని సంబర పడిపోయాడు. కానీ ఎన్నో దెబ్బలు రుచి చూసి.. చావును సైతం ఎదుర్కొన్న చంద్రబాబు.. వీటన్నీంటినీ ముందు చాలా లైట్ తీసుకున్నారు. యువకుడు, ఉడుకు రక్తం.., స్నేహితుని కుమారుడు.., ఇంకా రాజకీయంలో ఎదగాలని జగన్ రెడ్డికి అనేక అవకాశాలిచ్చాడు. కానీ వెర్రి వెయి తలలు వేస్తే ఎలా ఉంటుందో.. ఆ మాదిగా సైకోయిజాన్ని ప్రతిపక్షంపై చూపడం మొదలు పెట్టాడు జగన్. ఈయనగారి సైకోయిజానికి అధికారులు, ప్రజలు, చివరికీ సొంతపార్టీ వారుకూడా మినహాకాలేకపోయారు అన్నది నిజం.
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలపై దాడులు, ముఖ్య నేతల అరెస్ట్ లు, స్టేట్ పార్టీ కార్యాలయం విధ్వంసం వంటివి చూసిన చంద్రబాబు .. ఇక ఊరుకునే కొద్దీ ఉనికే ప్రమాదమని వ్యూహాలకు పదును పెట్టారు. పొటికల్ గేమ్ ఛేంజర్ గా మంచి అనుభవం ఉన్న చంద్రబాబు మొదలు పెట్టిన రాజకీయ చతురతకు జగన్ రెడ్డి ప్రస్తుతం ఉక్కిబిక్కిరవుతున్నారు. జనవరి 27 నుంచి కుప్పం వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏడు నెలలుపాటు సాగిస్తున్న పాదయాత్రలో రాయలసీమలో ఉన్న ఉమ్మడి నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాలో నారా లోకేష్ పర్యటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ఎమ్మెల్యే పనితీరును దుయ్యపట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అధికార మదంతో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అకృత్యాలను బట్టబయలు చేసి పదునైన విమర్శలతో ఊచకోత కోశాడు. ఇదిలా ఉంటే పవన్ వారాహి యాత్ర గోదావరి జిల్లాలతో ప్రారంభమై.. ఉత్తరాంధ్రా వైపు దూసుకుపోతోంది. రాయలసీమ నుంచి లోకేష్ .. ఉత్తరాంధ్ర నుంచి పవన్ లు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పార పట్టారు. వీరి యాత్రతోపాటు చంద్రబాబు కూడా స్పీడ్ పెంచారు. సాగునీటి ప్రాజెక్ట్ ల సందర్శన పేరుతో యుద్ధభేరికి శ్రీకారం చుట్టారు. రాయలసీమలో విధ్వంసానికి గురైన సాగు నీటి ప్రాజెక్ట్స్ ను సందర్శించడానికి ఆగస్టు 1 న చంద్రబాబు నంద్యాల నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు సాగించి యుద్ధభేరికి అనూహ్యం స్పందన లభించింది. అడుగడుగునా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో చేసిన నిర్లాక్ష్యాన్ని ఎండగట్టారు. జగన్ చేతగాని తనాన్ని నిలదీశారు. రైతాంగం ఇబ్బందులను, ప్రాజెక్ట్ ల విధ్వంసంకు సంబంధించిన లోతైన కారణాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోయారు బాబు. దీంతో జగన్ అండ్ కో కు గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం మొదలైంది. సాగు నీటి ప్రాజెక్ట్ విషయం అప్పటీ వరకు జగన్ చేస్తున్న అక్రమాలు, అవినీతి, తప్పులు త్రిశూల వ్యూహంతో ప్రజలకు లైవ్ షో చూపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మూడు శక్తులు ఏకమై సాగించే దండయాత్రకు తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి.
ఇలా త్రిముఖాలు త్రిశూల వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ముప్పెటదాడికి దిగారు చంద్రబాబు. దీంతో వరసగా చేస్తున్న విమర్శల దాడిని తట్టుకోలేక జగన్ అండ్ కోటరి విచక్షణ మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగుతోంది. దీన్ని చంద్రబాబు, లోకేష్, పవన్ లు సమర్థవంతగా తిప్పికొడుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలు, పడుతున్న ఇబ్బందులు, భవిష్యత్తుకు గ్యారెంట్ ఇచ్చే హామీలతో చంద్రబాబు, లోకేష్, పవన్ ల టూర్ ఏపీలో పొలిటికల్ హీట్ ను రాజేస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.