టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అమరావతి హై కోర్టులో భారీ ఊరట లభించింది.. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హై కోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది.. ఆయనపై నమోదయిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, 30 రోజుల తర్వాత కూడా ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించడంలో సీఐడీ విఫలమయిందని కోర్టు వ్యాఖ్యానించింది.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తాజాగా ఆయన సాధారణ బెయిల్‌ని మంజూరు చేసింది ఏపీ ఉన్నత న్యాయస్థానం.. అయితే, ఈ 29వరకు చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలలో పాలుపంచుకోకూడదని, గతంలో ఇచ్చిన షరతులు వర్తిస్తాయని తేల్చి పారేసింది హై కోర్టు..
బాబుకి రెగ్యులర్ బెయిల్ లభించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది.. గత రెండున్నర నెలలుగా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య సాగుతున్న ఫైట్.. కోర్టులకే పరిమితం అయింది. ప్రజాక్షేత్రంలో కంటే న్యాయస్థానాలలోనే ఈ రెండు పార్టీలు పోరాడుతున్నాయనే విశ్లేషణ సాగుతోంది.. చంద్రబాబుకి సాధారణ బెయిల్ లభించడంతో ఇక పోరాటం ప్రజాక్షేత్రానికి మారనుంది.. ఇప్పటికే బెయిల్ లభిస్తే ఏం చేయాలో చంద్రబాబు పక్కా ప్రణాళికను రచించుకున్నారట.. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేయడం, జైలులో రిమాండ్‌కి పంపడంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు.. దీంతో, ఎలాంటి ప్రసంగాలు చేయాలి.? ప్రజలతో ఎలాంటి అంశాలు చర్చించాలి? అనే అంశాలపై ఇప్పటికే చంద్రబాబు కీలక సమాచారం సేకరించి ఉంచుకున్నారని సమాచారం..
మరోవైపు, బెయిల్‌పై విడుదల తరవాత చంద్రబాబుకి భారీగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలతోపాటు ప్రజలు కూడా నీరాజనాలుపట్టారు.. రాజమండ్రి నుండి అమరావతి వరకు ఆయనకు భారీగా స్వాగతం కలిపారు.. జగన్‌పై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉందో చంద్రబాబుకి కళ్లకి కట్టినట్లు అర్ధం అయింది.. గత కొన్ని రోజులుగా ఏపీలోని అధికార పార్టీపై చంద్రబాబు పలు రిపోర్టులు తెప్పించుకున్నారు.. జగన్ సర్కార్ చేస్తోన్న ప్రతి విమర్శ, ప్రతి నిర్ణయాన్ని ఆయన సమీక్షించారట.. ఇటు న్యాయనిపుణులతోపాటు పార్టీ సీనియర్ నేతలతోనూ బాబు పలు దఫాలుగా చర్చించారని సమాచారం.. వీటిపైనే చంద్రబాబు త్వరలో ప్రజా క్షేత్రంలో జగన్‌పై అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది..
చంద్రబాబు నంద్యాలలో ఉన్న సమయంలో ఆయనని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచింది సీఐడీ.. అందుకే, అక్కడి నుండే ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నారట. ఇటు నంద్యాల ప్రజలు సైతం చంద్రబాబు రాకకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని సమాచారం.. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడతారు?? ఎలాంటి సంచలనాలు పేల్చుతారో అనేది ఆసక్తిగా మారుతోంది.. మరి, ప్రజా క్షేత్రంలో బాబు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏపీలో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు రేగుతాయో చూడాలి….