డైవర్ట్ పాలిటిక్స్ ఆపండి..
వివేకా హత్యలో సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్యను తనపై నెట్టి జగన్ రాజకీయంగా లబ్ధి పొందారని, బాబాయ్ హత్య ఘటనలో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారని చంద్రబాబు విమర్శించారు. హత్య కేసులో సూత్రదారి ఎవరనేది ఎప్పుడో తేలిందని, ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పారు. ఆనాడు గ్యాగ్ ఆర్డర్ తేవడం నుంచి.. ఇప్పుడు సీబీఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి సమస్యకు, ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ ను అమలు చేస్తున్న జగన్..ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరన్నారు. వైఎస్ కోటలో వైఎస్ తమ్ముణ్ని హత్యచేయడంలో అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా అని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విలీనం, జిల్లాల విభజన విషయంలో శాస్త్రీయత అనేది లేదని చంద్రబాబు విమర్శించారు.
Must Read:-జగన్ భయపడతాండు!? సునీత సంచలన వాంగ్మూలంలో వాస్తవాలు ఇవే!!