టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంతకి సౌత్ లో ఎంత క్రేజుందో తెలిసిందే. ఏ హీరోయిన్ కు లేని ఫ్యాన్ బేస్ ఆమె సొంతం. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ తో పంచుకుంటుంది. అలాగే 2019వ సంవత్సరంలో తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. ప్రస్తుతం ఆ ఫోటోలను రీషేర్ చేసి వైరల్ చేస్తున్నారు ఆమె అభిమానులు.
అవి సమంత స్నేహితురాలి పెళ్లికి సంబంధించిన ఫోటోలు. అందులో సమంత చాలా క్యూట్ గా ఉంది. లేత నీలి రంగు గౌను ధరించి అందంగా ఉంది. అంతేకాకుండా చేతి వేలికి తన పెళ్లి ఉంగరం, అలాగే డైమండ్ బ్రాస్లెట్, ముత్యాలతో చేసిన డ్రాప్ చెవిపోగులు పెట్టుకొని అక్కడ ఉన్నవారు చూపు తిప్పుకోలేని విధంగా ఉంది సమంత. ఇప్పుడు ఈ ఫోటోలను ఆమె అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో రీషేర్ చేస్తున్నారు. రీషేర్ చేయడమే కాకుండా ‘ప్రతీది మారిపోయింది, నువ్వు తప్ప’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నిజంగానే కాలం మారిపోయింది కాని సమంత మాత్రం మారలేదు అని నెటిజన్లు అంటున్నారు. ఇక లాక్ డౌన్ రూల్స్ సడలించడంతో సమంత తన భర్త చైతన్యతో కలిసి హాలిడే కు మాల్దీవులు వెళ్ళింది. ఈమధ్యనే తిరిగి వచ్చిన సమంత మన తెలుగు ఓటీటీ అయిన ‘ఆహా’లో ప్రసారమవుతున్న తన టాక్ షో సామ్ జామ్ కు సంబంధించిన షూటింగ్ లో జాయిన్ అయ్యింది. దీనితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది సమంత. షూటింగ్ వచ్చే వారం మొదలవుతోందని అందులో సమంత జాయిన్ అవుతోందని సమాచారం.
Must Read ;- సమంత, రాశి.. ఒకే డ్రెస్, ఒకే విరుపు.. భలే మెరుపు